News March 21, 2025

రాజమండ్రిలో అధికారుల మెరుపు దాడులు

image

తూర్పుగోదావరి జిల్లాలో ఈగల్ టీం శుక్రవారం మెరుపు దాడులు చేసింది. పలు మెడికల్ షాపుల్లో తనిఖీలు చేసింది. రాష్ట్రంలోని యువత మత్తు పదార్థాలను ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటున్నట్లు సమాచారం ఉండటంతో దాడులు నిర్వహించామని విజిలెన్స్ అధికారి ఎం.స్నేహిత, డ్రగ్స్ ఏడీ నాగమణి తెలిపారు. రాజమండ్రి గణేశ్ చౌక్ వద్ద ఉన్న ఓ మెడికల్ ఏజెన్సీలో ట్రెమడల్ మెడిసిన్ స్వాధీనం చేసుకున్నారు.

Similar News

News March 24, 2025

రాజమండ్రి: 27న ఉపసర్పంచ్ పదవులకు ఎన్నికలు

image

జిల్లాలో వివిధ కారణాలు వల్ల ఖాళీగా ఉన్న 12 ఉపసర్పంచ్ పదవులకు ఈనెల 27న ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు డీపీవో శాంతామణి అన్నారు. రాజమండ్రి డివిజన్‌లో మల్లవరం, పాతతుంగపాడు, లక్ష్మినరసాపురం, మర్రిపూడి, మురమండ, మునికుడలి, కొవ్వూరు డివిజన్‌లో పెనకనమెట్ట, కొవ్వూరుపాడు, గోపాలపురం, వెంకటాయపాలెం, తాడిపూడి, ఉంద్రాజవరం పంచాయతీల ఉపసర్పంచ్ పదవులకు ఎన్నికలు జరుగనున్నాయి. EOPR&RD ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్నారు.

News March 24, 2025

రాజమండ్రి: మర్డర్ కేసులో పట్టుబడ్డ నిందితుడు

image

రాజమండ్రి రూరల్ హుకుంపేట డీ బ్లాక్‌లో ఆదివారం తల్లీ కుమార్తెలు ఎండీ సల్మాన్, ఎండీ సానియా మర్డర్ కేసులో నిందితుడు పల్లి శివకుమార్ పోలీసులకు పట్టుబడ్డాడు. కాగా నిందితుడు ముళ్ల కంచెలలో నుంచి పరారవుతున్న సమయంలో కొవ్వూరు రూరల్ ఎస్సై శ్రీహరి వెంబడించారు. నిందితుడి నుంచి ప్రతిఘటన ఎదురవడంతో ఎస్సైకి స్వల్ప గాయాలయ్యాయి. విధి నిర్వహణలో ధైర్యసాహసాలతో ఎస్సై నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

News March 24, 2025

తూ.గో: నేడు యధావిధిగా పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమం

image

సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక రేపు యధావిధిగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో, డివిజన్,మున్సిపల్ మండల కేంద్రాలలో ఉదయం 10.గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజల నుంచి అధికారులు అర్జీలు స్వీకరిస్తారని కలెక్టర్ తెలిపారు. అన్ని శాఖలకు సంబంధించి జిల్లా, డివిజన్ మండల, మున్సిపల్ అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆమె ఆదేశించారు.

error: Content is protected !!