News January 26, 2025
రాజమండ్రిలో ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య- ఎస్సై

రాజమండ్రి పనసచెట్టు సెంటర్ ప్రాంతానికి చెందిన సాలా బాల పరమేశ్వరి(35) ఆర్థిక ఇబ్బందులతో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. భర్త మృతి చెందడంతో ఇద్దరు పిల్లలతో కలిసి ఉండేది. మృతదేహాన్ని త్రీ టౌన్ పోలీసులు పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి డెడ్‌బాడీని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
Similar News
News February 9, 2025
రోడ్డు ప్రమాదంలో తాడేపల్లిగూడెం మహిళ మృతి

ప్రత్తిపాడులో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో తాడేపల్లిగూడెం(M) కొండ్రుపోలుకు చెందిన లక్ష్మి మృతిచెందింది. భర్త సత్యనారాయణతో దువ్వలో బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా ప్రత్తిపాడు హైవేపై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆమె తలకు గాయమై చనిపోయింది. భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు SI స్వామి తెలిపారు.
News February 9, 2025
తూ.గో: 26 మంది ఉద్యోగులకు షాకోజ్ నోటీసులు

విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న 26 మంది ఉద్యోగులకు శనివారం కలెక్టర్ షాకోజ్ నోటీసులు జారీ చేశారు. వారిలో 12 మంది డిప్యూటీ తహశీల్దార్లు , 12 మంది మండల సర్వేయర్లు, ఇద్దరు గ్రామ సర్వేయర్లు ఉన్నారు. రాజమండ్రి రూరల్, పెరవలి, గోపాలపురం, చాగల్లు, గోకవరం, కడియం, దేవరపల్లి, నల్లజర్ల, బిక్కవోలు, కోరుకొండ, సీతానగరం, రాజానగరం మండలాల డిప్యూటీ తహశీల్దార్లు ఉన్నారు.
News February 9, 2025
RJY: సంగీతా నృత్య పాఠశాలను సందర్శించిన మంత్రి

రాజమండ్రిలోని విజయశంకర్ ప్రభుత్వ సంగీతా నృత్యపాఠశాలను శనివారం రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక ,సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థినీవిద్యార్థులతో మాట్లాడారు. సంగీత నృత్య పాఠశాల అభివృద్ధికి కృషిచేస్తానని తెలిపారు. రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక శాఖ కమీషన్ ఛైర్‌పర్సన్ పొడపాటి తేజస్విని పాల్గొన్నారు.