News February 24, 2025
రాజమండ్రిలో కోనసీమ వ్యక్తి మృతి

వెంకటనగరం వీఆర్వో గునపాటి మురళీకృష్ణ (49) ఆదివారం అనారోగ్యంతో రాజమండ్రిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మృతిచెందారు. ఆయన స్వగ్రామం ఆలమూరు మండలం చొప్పెల్ల గ్రామం. ఆయనకు భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. మురళీకృష్ణ మృతి పట్ల రూరల్ తహశీల్దార్ సూర్యకుమార్, విఆర్వోలు, తహశీల్దార్ కార్యాలయం సిబ్బంది ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.
Similar News
News October 27, 2025
ఎన్టీఆర్ జిల్లాలో 189 పునరావాస కేంద్రాలు

మొంథా తుపాను నేపథ్యంలో ప్రజల భద్రతకు జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉందని కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. 189 పునరావాస కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయని, అత్యవసర సహాయానికి 24×7 కంట్రోల్ రూమ్ (91549 70454) అందుబాటులో ఉందని కలెక్టర్ వెల్లడించారు.
News October 27, 2025
సిరిసిల్ల: జిల్లాలోని 48 దుకాణాలకు లక్కీ డ్రా

జిల్లాలోని మొత్తం 48 మద్యం దుకాణాలకు లక్కీడ్రా తీసి వారి నంబర్ వచ్చిన వారికి కేటాయించినట్లు సిరిసిల్ల ఇన్చార్జ్ కలెక్టర్ గరీమ అగర్వాల్ తెలిపారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో మద్యం దుకాణాల లక్కీడ్రాను సోమవారం నిర్వహించామన్నారు. జిల్లాలోని మొత్తం 48 మద్యం దుకాణాలకు, గౌడ్లకు 4, SCలకు 5 కేటాయించమన్నారు. మొత్తం 48 దుకాణాలకు 1381 దరఖాస్తులు వచ్చాయన్నారు. డిసెంబర్ 1 నుంచి నూతన దుకాణాలు ప్రారంభమవుతాయన్నారు.
News October 27, 2025
ప్రతి కుటుంబ ఆదాయంపై కేంద్రం సర్వే

జనగణన… ఓటర్ల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్… తాజాగా ఈ సర్వేల జాబితాలోకి మరొకటి చేరింది. పాన్ ఇండియా స్థాయిలో ఆదాయ సర్వేకు కేంద్రం నిర్ణయించింది. దేశంలో తొలిసారిగా 2026 FEB నుంచి ఈ ఆదాయ గణనను MoSPI ఆరంభిస్తుంది. ప్రతి కుటుంబ ఆదాయాన్ని లెక్కించనుంది. 2027 మధ్యలో సర్వే వివరాలు ప్రకటిస్తారు. అయితే ఇన్కమ్ వివరాలు రాబట్టడం సవాళ్లతో కూడుకున్నది కావడంతో ముందుగా ప్రజల్లో అవగాహన కల్పించనున్నారు.


