News September 7, 2024
రాజమండ్రిలో చిరుత
రాజమండ్రి అటవీప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపింది. హౌసింగ్ బోర్డు కాలనీ, పుష్కరవనం మధ్యలో అటవీశాఖ సిబ్బంది నివాసాలు ఉన్న ప్రాంతంవైపు శుక్రవారం వేకువజామున చిరుత ఓ జంతువును నోటకరిచి రోడ్డు దాటింది. దీనిని స్థానికులు గుర్తించి అధికారులకు సమాచారమిడంతో వారు పాదముద్రలు సేకరించారు. చిరుత సంచరించిన ప్రాంతంలో 6 ట్రాప్ కెమెరాలను ఏర్పాటుచేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Similar News
News October 9, 2024
రాజనగరం: లారీ ఢీకొని లీగల్ పారా వాలంటీర్ మృతి
జాతీయ రహదారిపై ఆటోనగర్ వద్ద బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, మరొక మహిళ గాయపడింది. పోలీసుల కథనం ప్రకారం.. లీగల్ పారా వాలంటీర్‌గా పనిచేస్తున్న రాజమండ్రికి చెందిన పెనుగుల బేబీ ప్రశాంతి (50), జీఎస్ఎల్ ఆసుపత్రిలో పని చేస్తున్న ఆకుమర్తి సత్యవతి స్కూటీపై రాజానగరం నుంచి రాజమండ్రి ఇద్దరూ కలిసి వెళ్తుండగా వెనకనుంచి వస్తున్న లారీ ఢీకొనడంతో ప్రశాంతి అక్కడిక్కడే మృతి చెందిందని తెలిపారు.
News October 9, 2024
రాజానగరం: భూపాలపట్నంలో డ్రగ్స్ కలకలం
రాజానగరం మండలం భూపాలపట్నంలో ఓ బర్త్ డే పార్టీలో ముగ్గురు యువకులు డ్రగ్స్ సేవిస్తూ పోలీసులకు పట్టుబడిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం ఓ ఫంక్షన్ హాల్ వద్ద జరుగుతున్న బర్త్ డే ఫంక్షన్‌లో పాల్గొన్న ముగ్గురు యువకులు కారులో కూర్చుని డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు పట్టుబడ్డారు. యువకులకు ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అన్న కోణంలో కేసుని నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు తెలిపారు.
News October 9, 2024
తూ.గో: దసరాకు 16 ప్రత్యేక రైళ్లు
దసరాకు విజయవాడ-శ్రీకాకుళం, శ్రీకాకుళం-విజయవాడకు 16 ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే సీపీఆర్ఓ శ్రీధర్ మంగళవారం తెలిపారు. విజయవాడ-శ్రీకాకుళానికి ఈ నెల 9, 10,11,12,14,15,16,17 తేదీల్లో ప్రత్యేక రైలు నడుస్తుందన్నారు. శ్రీకాకుళం-విజయవాడకు ఈ నెల 10,11,12,13,15,16,17,18 తేదీల్లో ప్రత్యేక రైలు తిరుగుతుందన్నారు. ఈ రైళ్లు నిడదవోలు, రాజమండ్రి, అనపర్తి, ద్వారపూడి స్టేషన్లో నిలుస్తాయన్నారు.