News March 25, 2025

రాజమండ్రిలో జంట హత్యలు.. అసలేం జరిగిందంటే.!

image

రాజమండ్రిలో జంట హత్యలు కలకలం రేపిన విషయం తెలిసిందే. DSP శ్రీవిద్య కీలక విషయాలు వెల్లడించారు. శ్రీకాకుళానికి చెందిన శివకుమార్ సుమియా లవర్స్. తండ్రి మృతిచెందగా ఆమె తల్లి సాల్మాతో రాజమండ్రిలో ఉంటోంది. సుమియా వేరే వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతోందని శివ గొడవపడ్డాడు. ఆదివారం సుమియా మేడపైకి వెళ్లగా.. పడుకొని ఉన్న తల్లిని కత్తితో చంపేసి, తలుపు వెనుక ఉండి కూతురినీ చంపేశాడు. నిందితుడు అరెస్టయ్యాడు.

Similar News

News October 28, 2025

Way2News ‘తుఫాను’ అప్‌డేట్స్

image

AP: మొంథా తుఫాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భీకర గాలులకు పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఈ రాత్రి తుఫాను తీరం దాటనున్న నేపథ్యంలో తాజా వాతావరణ సమాచారం, అధికారుల సూచనలు, సహాయక చర్యల వివరాలు తెలుసుకోవడానికి ‘Way2News’ను ఫాలో అవ్వండి. కచ్చితమైన, తాజా అప్‌డేట్‌లను అందిస్తూ మిమ్మల్ని సురక్షితంగా ఉంచడంలో వే2న్యూస్ తోడుగా ఉంటుంది.

News October 28, 2025

నంద్యాల: ‘అవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దు’

image

నంద్యాల జిల్లాకు మొంథా తుఫాన్ ప్రభావం వలన ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిన నేపథ్యంలో జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్న సందర్భంగా పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలను ప్రమాదాలబారీన పడకుండా అప్రమత్తం చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా SP సునీల్ షెరాన్‌ తెలిపారు. రహదారుల్లో ప్రయాణించే భారీ వాహనాలను రాత్రి 7 గంటల నుంచి సురక్షితమైన ప్రాంతాల్లో నిలుపుకోవాలన్నారు. ఎవరైనా ప్రమాదంలో ఉంటే 112కు ఫోన్ చేయాలన్నారు.

News October 28, 2025

అన్నమయ్య జిల్లాలోని స్కూళ్లకు సెలవు లేదు: డీఈవో

image

అన్నమయ్య జిల్లాలో స్కూళ్లకు బుధవారం సెలవు లేదని జిల్లా విద్యాశాఖాధికారి Dr. K. సుబ్రమణ్యం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం నుంచి పాఠశాలలు యథావిధిగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు అన్ని మండల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని ప్రైవేట్ పాఠశాలలు రేపు స్కూళ్లను కొనసాగించాలని, అంగన్వాడీ సెంటర్లు కూడా తెరవాలని ఆదేశించారు.