News March 24, 2025
రాజమండ్రిలో తల్లీకుమార్తెలను హత్య చేసింది ఇతడే

రాజమండ్రి రూరల్ హుకుంపేట డీ బ్లాక్లో ఆదివారం తల్లీ కుమార్తెలు ఎండీ సల్మాన్, ఎండీ సానియా మర్డర్ కేసులో నిందితుడు పల్లి శివకుమార్ పోలీసులకు పట్టుబడ్డాడు. కాగా నిందితుడు ముళ్ల కంచెలలో నుంచి పరారవుతున్న సమయంలో కొవ్వూరు రూరల్ ఎస్సై శ్రీహరి వెంబడించారు. నిందితుడి నుంచి ప్రతిఘటన ఎదురవడంతో ఎస్సైకి స్వల్ప గాయాలయ్యాయి. విధి నిర్వహణలో ధైర్యసాహసాలతో ఎస్సై నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Similar News
News October 24, 2025
ప్రమాదం జరిగిన బస్సుపై భారీగా జరిమానాలు

AP: కర్నూలు జిల్లాలో జరిగిన ప్రమాదంలో దగ్ధమైన బస్సుపై చాలా జరిమానాలు ఉన్నాయి. ఇటీవల ఓవర్ స్పీడ్, డేంజర్ స్పీడ్ చలాన్లు నమోదయ్యాయి. మొత్తం రూ.23 వేల వరకు ఫైన్లు ఉన్నాయి. వేమూరి కావేరి సంస్థకు చెందిన బస్సు డ్రైవర్లు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారనే దానికి ఈ జరిమానాలే నిదర్శనం. మరోవైపు ఈ బస్సుకు 2024 ఏప్రిల్లో ఇన్సూరెన్స్, గత మార్చిలో ఫిట్నెస్ వ్యాలిడిటీ ముగియడం గమనార్హం.
News October 24, 2025
బస్సు అగ్ని ప్రమాద ఘటనపై హోంమంత్రి దిగ్బ్రాంతి

కర్నూలు జిల్లా చిన్నటేకూరు గ్రామ సమీపంలో బస్సు అగ్ని ప్రమాదానికి గురైన సంఘటనపై హోం మంత్రి వంగలపూడి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా పేర్కొన్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు.
News October 24, 2025
బస్సు ప్రమాదం: మీకు హ్యాట్సాఫ్ బ్రదర్, సిస్టర్❤️

చిన్నటేకూరు వద్ద బస్సు ప్రమాద దుర్ఘటనలో ఇద్దరు దైవాల్లా ఆదుకున్నారు. ఆ సమయంలో అటుగా ప్రయాణించిన ఓ మహిళ వీడియో తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తీవ్రత గుర్తించి అన్ని విభాగాలను వారు అప్రమత్తం చేసేలా ఆ వీడియో హెల్ప్ చేసింది. ఇక ఆ రూట్లో వెళ్లిన ఓ వ్యక్తి కార్లో ఆరుగురు క్షతగాత్రులను హుటాహుటిన కర్నూలు ఆస్పత్రిలో డ్రాప్ చేసి వెళ్లిపోయారు. ఆ ఇద్దరితో పాటు ఆపదలో ఆదుకున్న ప్రతి ఒక్కరికీ హ్యాట్సాఫ్❤️❤️


