News January 6, 2025

రాజమండ్రిలో నిలిచిన షిర్డీ ఎక్స్‌ప్రెస్

image

కాకినాడ నుంచి షిర్డీ వెళ్తున్న షిర్డీ ఎక్స్‌ప్రెస్‌ టైన్‌ను రాజమండ్రిలో రైల్వే అధికారులు నిలిపివేశారు. కాకినాడ, సామర్లకోటలో ప్రయాణికులు రైలు ఎక్కలేకపోయారు. వారు ఫిర్యాదు చేయడంతో ఈ ట్రైన్ ఆపినట్లు రైల్వే అధికారులు తెలిపారు. వారిని వేరే రైలు ద్వారా కాకినాడ, సామర్లకోట నుంచి రాజమండ్రికి తీసుకొస్తున్నారు. ప్రయాణికుల కోసం సుమారు 2గంటలకుపైగా రాజమండ్రిలోనే షిర్డీ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది.

Similar News

News January 17, 2025

తూ.గో : బరువెక్కిన గుండెతో పయనం

image

తూ.గో జిల్లా వ్యాప్తంగా ప్రయాణికులు సంక్రాంతి పండుగ ముగించుకుని పట్టణాలకు పయనమయ్యారు. ఈ సందర్భంగా పండుగ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. అప్పుడే పండుగ ముగిసిందా అన్నట్లుగా ఉద్యోగ, వ్యాపారాల రీత్యా పట్టణాలకు వెళ్తున్నారు. ఈసంక్రాంతి సంబరాలను రాబోయే పండగ వరకు నెమరువేసుకుంటూ సంతోషిస్తామని పలువురు ప్రయాణికులు తెలిపారు. పిండి వంటలతో పట్టణాలకు పయనమయ్యేవారితో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిశాయి.

News January 16, 2025

అసలు ఎవరీ రత్తయ్య..?

image

సంక్రాంతి నేపథ్యంలో ఉభయగోదావరి జిల్లాల్లో వేలల్లో పందేలు జరిగాయి. వందల కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఈసారి తాడేపల్లిగూడెంలో ఏకంగా రూ.1.25 కోట్ల పందెం జరిగింది. కోడిపందేల్లో పేరు మోసిన రత్తయ్య పుంజు, గుడివాడ ప్రభాకర్ పుంజు మధ్య రసవత్తరంగా పందెం జరిగింది. ఎంతో పేరు మోసిన రత్తయ్య పుంజు ఓడిపోవడంతో అందరూ ఖంగుతిన్నారు. అసలు ఎవరీ రత్తయ్య అని ఆరా తీయగా.. ఆయనది లింగపాలెం మండలం రంగాపురం అని తేలింది.

News January 15, 2025

గోసాల ప్రసాద్ మృతి

image

ప్రముఖ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు గోసాల ప్రసాద్ బుధవారం తెల్లవారుజామున కాకినాడలోని ఆయన స్వగృహంలో మృతి చెందారు. గత కొంత కాలంగా కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఇంటి నుంచి బయటకు వస్తుండగా ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబీకులు తెలిపారు.