News March 26, 2025
రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ మృతదేహానికి పోస్టుమార్టం

హైదరాబాద్కి చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల <<15882715>>మృతదేహానికి <<>>పోస్టుమార్టం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో భారీ బందోబస్తు నడుమ బుధవారం నిర్వహిస్తున్నారు. ప్రవీణ్ కుటుంబ సభ్యులు సమక్షంలో వీడియో పర్యవేక్షణలో వైద్యులు పోస్టుమార్టం చేస్తున్నారు. ఇప్పటికే అధిక సంఖ్యలో క్రైస్తవ పెద్దలు ఆసుపత్రికి చేరుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Similar News
News April 2, 2025
వక్ఫ్ బిల్లుతో ముస్లింలకు మేలు: అమిత్ షా

వక్ఫ్ బిల్లుతో ముస్లింలకు మేలు జరుగుతుందని అమిత్షా స్పష్టం చేశారు. దీని ద్వారా వక్ఫ్ ఆదేశాలను కోర్టుల్లో సవాల్ చేయవచ్చన్నారు. ఈ బిల్లును చర్చి బోర్డులు కూడా సమర్థిస్తున్నాయని, ఇది అవినీతికి తప్ప ఏ మతానికి వ్యతిరేకం కాదని తేల్చి చెప్పారు. దీని ద్వారా మతాల మధ్య ఘర్షణ సృష్టించాలనే ఆలోచన తమకు లేదని ఆయన వివరించారు. ఈ బిల్లును తాము రాజ్యాంగబద్ధంగానే రూపొందించామని వెల్లడించారు.
News April 2, 2025
ఇంటర్ అర్హతతో నేవీలో ఉద్యోగాలు

ఇండియన్ నేవీ ‘అగ్నివీర్ సీనియర్ సెకండరీ రిక్రూట్’ పోస్టులకు ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులు పాసై 2004 సెప్టెంబర్ 1-2008 డిసెంబర్ 31 మధ్య జన్మించి ఉండాలి. ఎంపికైన ప్రతి నలుగురిలో ఒకరికే పర్మినెంట్ జాబ్. జీతం తొలి నాలుగేళ్లు రూ.30 వేల నుంచి రూ.40 వేల మధ్యలో ఉంటుంది. ఈ నెల 10లోగా https://www.joinindiannavy.gov.in/లో అప్లై చేసుకోవాలి.
News April 2, 2025
‘పాపన్న గౌడ్ ఆశయాల సాధనకు కృషి చేయాలి’

బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. బుధవారం ఐడిఓసిలో బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలకు అదనపు కలెక్టర్ నగేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సర్వాయి పాపన్న గౌడ్ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బీసీ సంఘం నాయకులు, అధికారులు పాల్గొన్నారు.