News December 4, 2024

రాజమండ్రిలో భూ ప్రకంపనలు

image

రాజమండ్రిలో బుధవారం ఉదయం కొన్ని సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. టీ నగర్, శ్యామల సెంటర్ తదితర ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయన్నారు. ప్రజలు తీవ్ర భయాందోళనతో ఇళ్లు, అపార్టుమెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

Similar News

News September 17, 2025

కలెక్టరేట్‌లో విశ్వకర్మ జయంతి వేడుకలు

image

విశ్వకర్మ జయంతి వేడుకలను పురస్కరించుకుని బుధవారం తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర పండుగగా విశ్వకర్మ జయంతి వేడుకలు జరిగాయని కలెక్టర్ తెలిపారు.

News September 16, 2025

మంత్రి కందులను కలిసిన కలెక్టర్‌

image

తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన కీర్తి చేకూరి మంత్రి కందుల దుర్గేశ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. చారిత్రక ప్రసిద్ధి చెందిన రాజమండ్రికి పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని కోరారు. తూర్పుగోదావరి జిల్లా రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు కలిగిన ప్రాంతమని, దానిని మరింతగా అభివృద్ధి చేయడానికి కృషి చేయాలని కలెక్టర్‌కు సూచించారు.

News September 15, 2025

తూ.గో పోలీస్ గ్రీవెన్స్‌కు 40 అర్జీలు

image

తూర్పుగోదావరి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన “పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం”లో 40 అర్జీలు వచ్చాయి. ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ మురళీకృష్ణ అర్జీలు స్వీకరించారు. అక్కడికక్కడే సంబంధిత పొలీసు అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానకి కృషి చేశారు. అర్జీలలో సివిల్ కేసులు, కుటుంబ సమస్యల గురించి, చీటింగ్ కేసులు, కొట్లాట కేసులు, ఇతర కేసులు ఉన్నాయన్నారు.