News September 6, 2024
రాజమండ్రిలో యాక్సిడెంట్.. ఇద్దరు బీటెక్ విద్యార్థులు మృతి

రాజమండ్రిలోని దివాన్ చెరువు వైపునకు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రవీణ్ కుమార్ (20), పల్నాడు జిల్లాకు చెందిన కార్తీక్ (19)గా గుర్తించారు. మృతులు గైట్ కళాశాలలో ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News December 27, 2025
జిల్లాలో ఖాళీల ఖిల్లా.. పండుగ వేళ పోలీసులకు సవాల్!

తూర్పుగోదావరి జిల్లాలో పండుగ వేళ శాంతిభద్రతల పరిరక్షణ సవాల్‌గా మారింది. కీలకమైన ఏఎస్పీ, డీఎస్పీ పోస్టులు ఖాళీగా ఉండటం విధి నిర్వహణపై ప్రభావం చూపుతోంది. రాజమండ్రిలో ముగ్గురు ఏఎస్పీలకు గాను ఎవరూ అందుబాటులో లేరు. ట్రాఫిక్, మహిళా పీఎస్, సెంట్రల్ డీఎస్పీ పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి. నూతన సంవత్సర, సంక్రాంతి వేడుకల వేళ సిబ్బంది కొరత పోలీసు శాఖను వేధిస్తోంది.
News December 27, 2025
29న యథావిధిగా ‘పీజీఆర్‌ఎస్’: కలెక్టర్

డిసెంబర్ 29న కలెక్టరేట్ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల వరకు ‘ప్రజా గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్’ (PGRS) కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. అర్జీదారులు నేరుగా లేదా Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో తమ వినతులను నమోదు చేసుకోవచ్చని సూచించారు. ప్రజల నుంచి వచ్చే సమస్యలను స్వీకరించి, వాటికి తక్షణ పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
News December 27, 2025
ఏపీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అమర్జహ బేగ్ బాధ్యతలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొవ్వూరు మండలం కాపవరానికి చెందిన అమర్జహ బేగ్ నియమితులయ్యారు. శనివారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబా చేతుల మీదుగా ఆమె నియామక పత్రాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఏఐసీసీ సభ్యురాలిగా ఉన్న అమర్జహ బేగ్ నియామకం పట్ల పలువురు కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.


