News September 6, 2024
రాజమండ్రిలో యాక్సిడెంట్.. శ్రీకాకుళం వాసి మృతి
రాజమండ్రిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రవీణ్ కుమార్(20) మృతి చెందారు. రాజమండ్రి దివాన్ చెరువు వైపుకు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీ కొట్టగా ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతులు గైట్ కళాశాలలో ఇంజినీరింగ్ సెకండీయర్ చదువుతున్నారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News October 12, 2024
శ్రీకాకుళం జిల్లాలో వీళ్ల టార్గెట్ ఒంటరి మహిళలే
ఖాళీగా ఉన్న ఇళ్లు, ఒంటరి వృద్ధులు, మహిళలే లక్ష్యంగా చేసుకుని <<14332419>>చోరీలకు<<>> పాల్పడుతున్న రాజగోపాల్, కిరణ్ తండ్రికొడుకులను శ్రీకాకుళం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రాజగోపాల్ ముందుగా రెక్కీ నిర్వహించి వృద్ధులు, మహిళలు ఉన్న ఇళ్లలో చోరీకి పాల్పడతారన ఎస్పీ వెల్లడించారు. వారి వద్ద రూ.7.70 లక్షల విలువైన బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. కాగా వారికి ఓ మహిళ కూడా సాయపడినట్లు తెలిపారు.
News October 12, 2024
అల్లర్లకు పాల్పడితే చర్యలు తప్పవు: శ్రీకాకుళం ఎస్పీ
విజయదశమి సందర్భంగా గ్రామాల్లో అమ్మవారికి కొమ్మలు వేసే సమయంలో వర్గాలుగా వీడి కొట్లాటకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. గ్రామాలు, పట్టణాల వారీగా రౌడీ షీట్ నమోదైన వారు, ఆకతాయిల వివరాలు పోలీసుల వద్ద ఉన్నాయన్నారు. అలాంటివారిపై పూర్తి నిఘా పెట్టామని ఆయన వెల్లడించారు.
News October 11, 2024
శ్రీకాకుళం: ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని దసరా పండగ మంచి విజయానికి చిరునామాగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎస్పీ మహేశ్వర రెడ్డి శ్రీకాకుళం జిల్లా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులతో ఆనందంగా, సుఖసంతోషాలతో పండుగ జరుపుకోవాలన్నారు.