News July 30, 2024
రాజమండ్రిలో లెక్చరర్ ఉద్యోగాలు

రాజమండ్రి SKR మహిళా డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకులుగా ఫిజికల్ డైరెక్టర్, బోటనీ బోధించడానికి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ రాఘవ కుమారి తెలిపారు. సంబంధిత సబ్జెక్టుకు సంబంధించి పీజీలో 55% మార్కులు ఉండాలని చెప్పారు. ఈనెల 31వ తేదీలోపు దరఖాస్తులను కళాశాలలో అందజేయాలన్నారు. ఆగస్టు 1న ఉదయం 10 గంటల నుంచి కాలేజీలోనే ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు.
Similar News
News November 17, 2025
ధాన్యం కొనుగోలు డబ్బులు 48 గంటల్లో జమ: జేసీ

ధాన్యం విక్రయించిన 48 గంటల్లోపే రైతుల ఖాతాల్లో మద్దతు ధర నేరుగా జమయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా జేసీ వై. మేఘా స్వరూప్ తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 3,240 మంది రైతులకు రూ.55.82 కోట్లు జమ చేసినట్లు సోమవారం రాజమండ్రిలో ఆయన వివరించారు. రైతులకు ఏ సమస్య ఎదురైనా వెంటనే 8309487151 నంబర్‌కు కాల్ చేసి తమ సందేహాలు, ఫిర్యాదులను తెలియజేయవచ్చని సూచించారు.

రాజమండ్రి: శబరిమలైకు ప్రత్యేక బస్సులు

శబరిమల భక్తుల నుంచి ఆర్టీసీ బస్సులకు అమితమైన ఆదరణ లభిస్తోంది. ఇందులో భాగంగా రాజమండ్రి డిపో నుంచి సోమవారం ఐదు సూపర్ లగ్జరీ బస్సులు శబరిమల యాత్రకు బయలుదేరాయి. ఈ బస్సులు యాత్ర ముగించుకుని ఈ నెల 23న తిరిగి డిపోకు చేరుకుంటాయి. భక్తుల ఆదరణకు డిపో మేనేజర్ మాధవ్ కృతజ్ఞతలు తెలిపారు. భక్తులు కోరితే వారి గ్రామాల నుంచి కూడా ప్రత్యేక బస్సులను నడపడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు.