News March 19, 2025

రాజమండ్రిలో సందడి చేసిన కోర్టు చిత్ర బృందం

image

రాజమండ్రిలోని స్వామిథియేటర్‌లో మంగళవారం ‘కోర్టు’ సినిమా యూనిట్‌ సందడి చేసింది. చిత్రంలో పులికొండ లాయర్‌ పాత్రపోషించిన ప్రియదర్శి, హీరో హర్షరోషన్, హీరోయిన్లు శ్రీదేవి,రిషిక, రైటర్‌ కమ్‌ డైరెక్టర్‌ రామ్‌ జగదీష్, మ్యూజిక్‌ డైరెక్టర్‌ తదితరులు పాల్గొని ప్రేక్షకులతో మాట్లాడారు. కోర్టు సినిమా అందర్ని గెలిపించిందన్నారు. మంచి చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ సినిమాను చూడాలన్నారు.

Similar News

News March 20, 2025

ధవలేశ్వరం: హత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు

image

రూరల్‌లోని 2019లో ధవలేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో కోర్టు ముద్దాయికి జీవిత ఖైదు, 5 వేల జరిమానా విధించింది. బుధవారం రాజమండ్రి కోర్టులో వాద ప్రతి వాదనలు విన్న తర్వాత జడ్జి విజయ్ గౌతమ్ ముద్దాయి దాడి గణేష్‌కు జీవిత ఖైదు విధించారు. భార్యపై అనుమానంతో దాడిచేసి చంపినట్లు రుజువైందని పీపీ లక్ష్మణ్ నాయక్ తెలిపారు. ధవలేశ్వరం సీఐ గణేష్, హెచ్సీ జయ రామరాజు ముద్దాయిని కోర్టులో హాజరు పరిచారు.

News March 19, 2025

రాజానగరం: దివాన్ చెరువులో రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీ

image

రాజమండ్రిలోని దివాన్ చెరువు సమీపంలో రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీని నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ సూచనల మేరకు అకాడమీ ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో కేంద్రం నుంచి అనుమతి రావడంతో.. దివాన్ చెరువు వద్ద దాని ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇక్కడ అకాడమీ ఏర్పాటు నిర్ణయం పట్ల స్థానిక ఎమ్మెల్యే బత్తుల హర్షం వ్యక్తం చేశారు.

News March 19, 2025

రాజమండ్రీలో సందడి చేసిన కోర్టు చిత్ర బృందం

image

రాజమండ్రిలోని స్వామిథియేటర్‌లో మంగళవారం ‘కోర్ట్‌’ సినిమా యూనిట్‌ సందడి చేసింది. చిత్రంలో పులికొండ లాయర్‌ పాత్రపోషించిన ప్రియదర్శి, హీరో హర్షరోషన్, హీరోయిన్లు శ్రీదేవి,రిషిక, రైటర్‌ కమ్‌ డైరెక్టర్‌ రామ్‌ జగదీష్, మ్యూజిక్‌ డైరెక్టర్‌ తదితరులు పాల్గొని ప్రేక్షకులతో మాట్లాడారు. కోర్ట్‌ సినిమా అందర్ని గెలిపించిందన్నారు. మంచి చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ సినిమాను చూడాలన్నారు.

error: Content is protected !!