News June 15, 2024
రాజమండ్రిలో ‘స్పా’ ముసుగులో వ్యభిచారం

రాజమండ్రిలో ‘స్పా’ కేంద్రం ముసుగులో యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో తూ.గో జిల్లా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు శుక్రవారం రాత్రి దాడి చేశారు. ఏవీ అప్పారావు రోడ్డులో జిమ్, స్పా కేంద్రం నిర్వహిస్తున్నారు. అందులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడి చేశారు. ముగ్గురు యువకులు, ముగ్గురు యువతులతో పాటు సిబ్బందిగా ఉన్న మరో యువతిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Similar News
News October 25, 2025
సోమ, మంగళవారాల్లో పాఠశాలలకు సెలవు: కలెక్టర్

భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని పాఠశాలలకు సోమ, మంగళవారాల్లో సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం తెలిపారు. సోమవారం రోజున నిర్వహించవలసిన ‘పీజీఆర్ఎస్ – మీ కోసం’ కార్యక్రమాన్ని కూడా రద్దు చేసినట్లు ఆమె వెల్లడించారు. ఇంటర్మీడియట్ కళాశాలల నిర్వహణపై స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.
News October 25, 2025
అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

వర్షాలు–సైక్లోన్ హెచ్చరికల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. శనివారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద అధికారులతో ఆమె సమావేశం నిర్వహించి, తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలపై దిశా నిర్దేశం చేశారు. మండలాధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని, ముందస్తు చర్యలు తప్పనిసరన్నారు. ప్రతి శాఖ సమన్వయంతో ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.
News October 25, 2025
ప్రాథమిక రంగానికి ఊతం ఇవ్వాలి: కలెక్టర్

తూ.గో జిల్లాలో ప్రాథమిక రంగానికి అనుబంధ పరిశ్రమలను స్థాపించే దిశగా అధికారులు ఔత్సాహికులను చురుకుగా ప్రోత్సహించాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. శనివారం రాజమండ్రిలో జరిగిన పరిశ్రమల-ఎగుమతుల ప్రోత్సాహక సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖలు పోస్ట్ హార్వెస్టింగ్ యూనిట్లు, పశుసంవర్ధక శాఖ డైరీ & పాల ఉత్పత్తుల పరిశ్రమలు, మత్స్య శాఖ, ఫీడ్ ఉత్పత్తి యూనిట్ల స్థాపనకు కృషి చేయాలన్నారు.


