News October 18, 2024
రాజమండ్రిలో 19న జాబ్ మేళా

రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఉన్న వికాస కార్యాలయంలో 19న ఉదయం 9 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహించనున్నట్లు వికాస ప్రాజెక్టు డైరెక్టర్ లచ్చారావు తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం రాజమహేంద్రవరంలో మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాలకు SSC, ఇంటర్, ఐటీఐ, డిప్లమా, బీటెక్ ఉత్తీర్ణులైన వారు అర్హులని తెలిపారు.
Similar News
News December 19, 2025
రాజమండ్రి: 21న జిల్లా కబడ్డీ జట్టు ఎంపిక

తూర్పుగోదావరి జిల్లా పురుషుల కబడ్డీ జట్టు ఎంపిక ఈనెల 21న నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి బురిడి త్రిమూర్తులు ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక ఎస్.కే.వి.టి డిగ్రీ కళాశాల మైదానంలో ఈ ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. జిల్లాలోని కబడ్డీ క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎంపికకు హాజరయ్యే క్రీడాకారులు తప్పనిసరిగా 85 కేజీల లోపు బరువు ఉండాలని స్పష్టం చేశారు.
News December 19, 2025
RJY: మంత్రి నారా లోకేష్ షెడ్యూల్ ఇదే..!

నారా లోకేశ్ శుక్రవారం రాజమహేంద్రవరంలో పర్యటించనున్నారు. ఉదయం 8:45కు విమానాశ్రయం చేరుకుని, తొలుత ఆర్ట్స్ కళాశాలలో నూతన భవనాలను ప్రారంభించి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు. మధ్యాహ్నం నన్నయ వర్సిటీలో భవనాలను ప్రారంభిస్తారు. అనంతరం చెరుకూరి కళ్యాణ మండపంలో పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమన్వయ సమావేశం నిర్వహించనున్నారు. మంత్రి పర్యటన నిమిత్తం అధికారులు, పార్టీ శ్రేణులు నగరంలో భారీ ఏర్పాట్లు చేశాయి.
News December 19, 2025
తూ.గో: కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ

అమరావతిలో గురువారం రెండో రోజు నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి.నరసింహ కిషోర్ పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి అభివృద్ధి కార్యక్రమాల అమలు, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు మెరుగైన సేవలందించడంలో శాఖల మధ్య సమన్వయంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ప్రభుత్వ లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేస్తూ, అభివృద్ధి ఫలాలను ప్రజలకు చేరవేయాలని సీఎం అన్నారు.


