News December 19, 2024
రాజమండ్రి: అధికారులకు కలెక్టర్ సూచనలు

వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు సంస్థాగత నిర్మాణం చేపట్టాలని తూ.గో. జిల్లా కలెక్టర్ ప్రశాంతి స్పష్టం చేశారు. గురువారం రాజమండ్రి కలెక్టర్ ఛాంబర్ లో వాయు కాలుష్యంపై జాతీయ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం, కాలుష్య నియంత్రణ మండలి, ఆర్ఎంసీ, రవాణా, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశంలో కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు. వాయు కాలుష్యాన్ని సమర్థవంతంగా నివారించడంలో ఉత్తమమైన పద్ధతులను అమలు చేయాలన్నారు.
Similar News
News November 15, 2025
దివాన్ చెరువులో కొత్త బిల్డింగ్‌కు రూ.3కోట్లు

రాజమహేంద్రవరం రూరల్ డివిజన్, సబ్-డివిజన్, రూరల్ ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీసులకు సంబంధించిన భవనాలు వేర్వేరు చోట్ల ఉన్నాయి. ఇవన్నీ ఒకేచోట ఉండేలా దివాన్ చెరువులో కొత్తగా భవనం నిర్మించనున్నారు. దీని కోసం రూ.3కోట్లు మంజూరయ్యాయని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వెల్లడించారు. నిధులు మంజూరు చేసిన ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజకి కృతజ్ఞతలు తెలిపారు.
News November 14, 2025
రాజమండ్రిలో రేషన్ డీలర్‌పై కేసు నమోదు

రాజమండ్రిలోని నెం.39 రేషన్ షాపును ఆర్డీవో కృష్ణనాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ అందుబాటు, పంపిణీ రిజిస్టర్లు, ఆన్లైన్ రికార్డులను సమగ్రంగా పరిశీలించారు. స్టాక్‌కు ఆన్లైన్ రికార్డులకు మధ్య 360 కిలోల బియ్యం అదనంగా ఉన్నట్లు గుర్తించారు. సంబంధిత రేషన్ షాపు డీలర్‌పై నిత్యావసర సరుకుల యాక్ట్ సెక్షన్ 6A కింద కేసు నమోదు చేశారు.
News November 14, 2025
రాజమండ్రి నుంచి శబరిమలకు ప్రత్యేక బస్సులు

అయ్యప్ప భక్తులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. రాజమండ్రి నుంచి శబమరిమలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. సూపర్ లగ్జరీ బస్సును డీపీటీవో వై.సత్యనారాయణమూర్తి శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. తిరుపతి, కాణిపాకం, అరుణాచలం మీదుగా శబరిమలకు బస్సులు వెళ్తాయన్నారు. 5రోజులు సాగే ఈ యాత్రకు ఈనెల 15, 17వ తేదీల్లో రాజమండ్రి నుంచి వెళ్తాయని చెప్పారు. డీఎం మాధవ్, పీఆర్వో శివకుమార్ పాల్గొన్నారు.


