News April 12, 2025
రాజమండ్రి: అనధికార లే ఔట్లపై చర్యలు.. కమిషనర్

రుడా పరిధిలోని అనధికార లే ఔట్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రుడా వైస్ ఛైర్మన్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు. శుక్రవారం RUDA ఛైర్పర్సన్ బొడ్డు వెంకట రమణ చౌదరి సూచనల మేరకు, వైస్ ఛైర్పర్సన్ కేతన్ గర్గ్ రుడా పరిధిలోని గ్రామ పంచాయితీ కార్యదర్శులతో అనధికార లే ఔట్లపై తీసుకొనబడుతున్న ఎన్ఫోర్స్మెంట్ చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, పలు ఆదేశాలు జారీ చేశారు.
Similar News
News December 8, 2025
రాజమండ్రి: నేడు PGRS కార్యక్రమం

డిసెంబర్ 8న (సోమవారం) జిల్లా వ్యాప్తంగా కలెక్టరేట్ నుంచి సచివాలయాల వరకు PGRS కార్యక్రమం యథాతథంగా జరుగుతుందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వాటిని తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పౌర సేవల కోసం వాట్సాప్ నంబర్ 95523 00009 అందుబాటులో ఉందని తెలిపారు. ఫిర్యాదుదారులు దీనిని వినియోగించుకోవాలని ఆమె సూచించారు.

News December 7, 2025
రౌడీషీటర్లకు ఎస్పీ హెచ్చరిక

తూర్పుగోదావరి ఎస్పీ డి.నరసింహ కిషోర్ ఆదేశాలతో ఆదివారం జిల్లావ్యాప్తంగా రౌడీషీటర్లు, గంజాయి, బ్లేడ్ బ్యాచ్లకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎస్హెచ్ఓల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో నేరస్తుల ప్రవర్తనపై ఆరా తీశారు. అందరూ సత్ప్రవర్తనతో మెలగాలని, మళ్లీ చట్టవ్యతిరేక పనులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఎస్పీ హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాల్లో భాగస్వాములైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.