News March 16, 2025
రాజమండ్రి: అమెరికా నుంచి వచ్చానని అమ్మాయిలకు వల

అమ్మాయిలను మ్యాట్రిమోనీ, షాదీ డాట్‌కాం ద్వారా మోసగిస్తున్న రాజమండ్రికి చెందిన వంశీకృష్ణను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాలు.. నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని అమెరికా నుంచి వచ్చానని, ఎన్నారైలను, రెండో పెళ్లికోసం చూస్తున్న వారి వద్ద డబ్బులు కాజేశాడు. డబ్బులు ఇవ్వమని అడిగిన వారి ఫొటోలు మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేసేవాడు. వంశీపై 20కి పైగా కేసులు నమోదయ్యాయి.
Similar News
News December 9, 2025
ఇంటి గుమ్మాన్ని ఎందుకు పూజించాలి?

గడపను ద్వార లక్ష్మిగా పూజిస్తే కుటుంబ శ్రేయస్సు కలుగుతుంది. ఇది దేవతలను ఆహ్వానించే ప్రదేశం కాబట్టి వారి అనుగ్రహం లభిస్తుంది. సిరిసంపదలతో పాటు, పెళ్లికాని వారికి మంచి భాగస్వామి దొరుకుతారు. ఇంట్లో ఉన్న కోర్టు సమస్యలు, ఆస్తి వివాదాలు తొలగిపోతాయి. సొంత ఇంటి కల నెరవేరాలంటే యజమాని ఈ ద్వారలక్ష్మి పూజ చేయాలని పండితులు సూచిస్తున్నారు. గడప పూజ కుటుంబానికి రక్షణ కవచంలా పనిచేస్తుందని అంటున్నారు.
News December 9, 2025
ఎంచివేస్తే, ఆరిక తరుగుతుందా?

కొందరు తమ దగ్గర ఉన్న సంపదను పదే పదే లెక్కబెడుతూ ఉంటారు. దాని గురించే ఆలోచిస్తూ ఉంటారు. నిరంతరం ఆ ధ్యాసలోనే బతుకుతారు. అయితే మన దగ్గర ఉన్న సంపద లేదా ధాన్యాన్ని ఎన్నిసార్లు లెక్కపెట్టినా అవి పెరిగిపోవు, తరగిపోవు. అవి మొదట ఎంత ఉన్నాయో, ఎన్నిసార్లు లెక్కించినా అంతే ఉంటాయి. వాటి గురించి పదే పదే ఆలోచన తగదు అని చెప్పే సందర్భంలో ఈ సామెత వాడతారు.
News December 9, 2025
రేపటి నుంచి TET.. పకడ్బందీ ఏర్పాట్లు

AP: ఈ నెల 10వ తేదీ నుంచి 21వ తేదీ వరకు టెట్ (Teacher Eligibility Test) పరీక్షలు జరగనున్నాయి. ఆన్‌లైన్ విధానంలో జరిగే ఈ పరీక్షల కోసం ఇప్పటికే పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. అభ్యర్థులు పరీక్షకు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని, హాల్ టికెట్‌తో పాటు ఒరిజినల్ ఐడెంటిటీ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని అధికారులు సూచించారు. ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి ఉండదన్నారు. రోజూ 2 విడతలుగా పరీక్షలు జరుగుతాయి.


