News January 28, 2025

రాజమండ్రి: అయ్యో పాపం..!

image

భార్యను ఆసుపత్రిలో చేర్చిన కాసేపటికే భర్త చనిపోయిన ఘటన తూ.గో జిల్లాలో జరిగింది. అనపర్తి(M) పాలమూరుకు చెందిన తాపీ కార్మికుడు అప్పారావు(52) అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను రాజమండ్రిలోని ఓ ఆసుపత్రిలో సోమవారం చేర్పించారు. తిరిగి ఇంటికి బయల్దేరిన ఆయన అనపర్తి శివారులో అలసటగా ఉండటంతో బైక్ ఆపి కూర్చునే ప్రయత్నం చేయగా.. ఫిట్స్‌తో కుప్ప కూలిపోయి మృతిచెందారు. ఈ ఘటనపై ఎస్సై దుర్గాప్రసాద్ కేసు నమోదు చేశారు.

Similar News

News December 1, 2025

HYDలో NEW YEAR సెలబ్రేషన్స్.. పర్మిషన్ తప్పనిసరి!

image

న్యూ ఇయర్-2026 ఈవెంట్లకు ముందస్తు అనుమతులు తప్పనిసరి అని సైబరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. 21-12-2025లోపు దరఖాస్తులను https://cybpms.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో సమర్పించాలని సూచించారు. కమర్షియల్/టికెటెడ్ ఈవెంట్లకు ఒక ఫారం, టికెట్ లేకుండా జరిగే ఈవెంట్లు నాన్ కమర్షియల్ ఫారంలో వివరాలు ఫిల్ చేయాలన్నారు. ఫిజికల్ అప్లికేషన్లకు అంగీకారం లేదని, DEC 21 తర్వాత దరఖాస్తులు తీసుకోమని పోలీసులు వెల్లడించారు.

News December 1, 2025

CM చంద్రబాబుపై లిక్కర్ కేసు మూసివేత

image

AP: సీఎం చంద్రబాబుపై ఉన్న లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ హయాంలో నమోదైన ఈ కేసు దర్యాప్తును ముగిస్తూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. అవకతవకలు జరిగినట్లు ఆధారాలు లేవని పేర్కొంది. దాని ఆధారంగా ఏసీబీ కోర్టు కేసును మూసేసింది. అలాగే ఆయనపై ఉన్న ఫైబర్‌నెట్ కేసును క్లోజ్ చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

News December 1, 2025

అర్జీలు రీ-ఓపెన్ కాకూడదు: అధికారులకు కలెక్టర్ ఆదేశం

image

విశాఖ కలెక్టరేట్‌లో కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పీజీఆర్ఎస్ నిర్వహించారు. ప్రజల నుంచి నేరుగా 237 వినతులు స్వీకరించారు. ఒకే సమస్యపై అర్జీలు మళ్లీ ‘రీ-ఓపెన్’ కాకుండా నాణ్యమైన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుదారులతో తప్పనిసరిగా ఫోన్లో మాట్లాడాలని సూచించారు. వచ్చిన వినతుల్లో రెవెన్యూ, జీవీఎంసీ సమస్యలే ఎక్కువగా ఉన్నాయని, వాటిని తక్షణమే పరిష్కరించాలని ఆయన స్పష్టం చేశారు.