News October 26, 2024

రాజమండ్రి: ఆర్టీసీ బస్సులోనే కండక్టర్ మృతి

image

భీమవరం నుంచి రాజమండ్రి వెళ్తున్న కొవ్వూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కండక్టర్ కె.ఎస్.నారాయణ శుక్రవారం రాత్రి బస్సులోనే మృతి చెందారు. పెనుగొండ మండలం వడలి గ్రామంలోని శ్రీనివాస సర్వీసింగ్ సెంటర్ వద్దకు వచ్చేసరికి కండక్టర్ నారాయణకు గుండె నొప్పి రావడంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందారు. ఆయన కుటుంబం కొవ్వూరులో నివాసం ఉంటున్నట్లు తోటి ఉద్యోగులు చెబుతున్నారు.

Similar News

News September 13, 2025

హోంగార్డ్స్‌ డి.ఎస్.పి గా పి. కిరణ్ కుమార్ బాధ్యతలు

image

తూర్పు గోదావరి జిల్లా డి.ఎస్.పి (హోంగార్డ్స్)గా పి. కిరణ్ కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు. 1996 బ్యాచ్‌కు చెందిన కిరణ్ కుమార్ సాధారణ బదిలీల్లో భాగంగా జిల్లాకు వచ్చారు. శాంతి భద్రతల పర్యవేక్షణలో హోంగార్డుల పాత్ర కీలకమని ఎస్పీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

News September 13, 2025

తూ.గో: కొత్త కలెక్టర్‌ను కలిసిన ఆర్డీవో

image

తూర్పుగోదావరి జిల్లా నూతన కలెక్టర్‌గా కీర్తి చేకూరి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం కలెక్టర్‌గా పనిచేస్తున్న పి. ప్రశాంతి బదిలీపై వెళ్లారు. రాజమండ్రి జిల్లా కలెక్టరేట్‌లో నూతన కలెక్టర్ కీర్తి చేకూరిని కొవ్వూరు ఆర్డీవో రాణి సుష్మిత మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శుభాకాంక్షలు తెలియజేసి పుష్పగుచ్ఛం అందజేశారు.

News September 13, 2025

తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన కీర్తి చేకూరి

image

తూర్పు గోదావరి జిల్లా మెజిస్ట్రేట్ & కలెక్టర్‌గా కీర్తి చేకూరి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ప్రజా ప్రతినిధులు, అధికారుల సమన్వయంతో జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తానన్నారు. ఆమెకు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది అభినందనలు తెలియజేశారు.