News November 27, 2024
రాజమండ్రి: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ముగ్గురు ఆత్మహత్యాయత్నం
ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. రాజమండ్రి జెఎన్ రోడ్డులోని సాయి సుధా రెసిడెన్సీలో బుధవారం ఉదయం ఒక కుటుంబంలోని భార్య, భర్త, కుమారుడు ముగ్గురు కూల్‌డ్రింక్‌లో విషం కలుపుకొని తాగారు. అపస్మారక స్థితిలో ఉండడాన్ని గమనించిన స్థానికులు వారిని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 11, 2024
ప్రత్తిపాడు: పులి ఆచూకీ కోసం గాలింపు
ప్రత్తిపాడు మండలం బురదకోట అటవీ ప్రాంతంలో పెద్ద పులి ఆచూకీ కోసం ఏలేశ్వరం ఫారెస్ట్ రేంజర్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం ముమ్మరంగా గాలించారు. ఎంత వెతికినా పులి జాడ మాత్రం కనిపించలేదు. దాని కోసం 6 ట్రాప్ కెమెరాలను బురదకోట పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేశారు. అనంతరం పులి ఆచూకీ తెలుసుకునేందుకు చేపట్టాల్సిన అంశాలపై రేంజర్ సమావేశం నిర్వహించి సిబ్బందికి సూచనలిచ్చారు.
News December 11, 2024
తూ.గో: అలా జరిగి ఉంటే వారు బతికి ఉండేవాళ్లు
మరో 5 కిలో మీటర్లు ప్రయాణించి ఉంటే ఇంటికి చేరుకునే వారు. అంతలో వారిని మృత్యువు కబళించింది. పి.గన్నవరం మండలం ఊడిమూడి వద్ద మంగళవారం జరిగిన ప్రమాదంలో పోతవరానికి చెందిన విజయ్ కుమార్ భార్య, కుమారుడు మృతి చెందగా.. మరొక కుమారుడు గల్లంతయ్యారు. దీంతో విజయ్ కుమార్ కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. భార్యాపిల్లలను కోల్పోయానని అతడు మృతదేహాల వద్ద రోధించిన తీరు అందరినీ కలచివేసింది.
News December 11, 2024
రైల్వే ప్రాజెక్టుపై సానుకూలంగా స్పందించారు: ఎంపీ హరీష్
టీడీపీ పార్లమెంటరీ నేత శ్రీకృష్ణదేవరాయలు, ఎంపీలతో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను మంగళవారం కలిశామని అమలాపురం ఎంపీ హరీష్ మధుర్ తెలిపారు. రైల్వే అభివృద్ధికి అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపామన్నారు. కోనసీమ జిల్లాలో రైల్వే ప్రాజెక్టు కోసం లేఖ అందజేశామని, దివంగత నేత బాలయోగి హయాంలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు.