News April 8, 2025

రాజమండ్రి: ‘ఉచిత వైద్య శిబిరాలను వినియోగించుకోవాలి’

image

రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ డీఎంహెచ్‌ఓ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం సోమవారం నిర్వహించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సోమవారం స్థానిక ఎస్.టి హాస్టల్‌లో శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎన్. శ్రీ లక్ష్మి పాల్గొని మాట్లాడారు. అందరూ ఆహార, శుభ్రత నియమాలు పాటించాలని సూచించారు.

Similar News

News April 25, 2025

సీఎం చంద్రబాబుకు క్షమాపణ చెబుతా : మాజీ ఎంపీ హర్ష కుమార్

image

తనను పోలీసులు అదుపులోకి తీసుకొని కొన్ని గంటలు నగరంలో తిప్పడంతో కోపం, బాధతో సీఎం చంద్రబాబును ఏకవచనంతో తూలనాడానని, ఇది తప్పేనని, అవసరమైతే ఆయనకు క్షమాపణ చెబుతానని మాజీ ఎంపీ హర్ష కుమార్ తెలిపారు. ఈ మేరకు హర్ష ఒక వీడియో విడుదల చేసి పశ్చాతాప పడ్డారు. పాస్టర్ ప్రవీణ్ మృతి చెందిన స్థలంలో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీకి పిలుపివ్వడంతో తనను అరెస్టు చేయడం బాధ అనిపించినా, పోలీసులు తనను గౌరవంగా చూశారన్నారు.

News April 25, 2025

తూ.గో జిల్లా వైసీపీ ఉపాధ్యక్షునిగా తాళ్లపూడి వాసి

image

తూ.గో జిల్లా వైసీపీ ఉపాధ్యక్షునిగా తాళ్లపూడి మండలం, పోచవరానికి చెందిన కాకర్ల వెంకటేశ్వరరావు నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. పలువురు నాయకులు, కార్యకర్తలు వెంకటేశ్వరరావుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తనకు అప్పగించిన ఈ బాధ్యతను సక్రమంగా చేస్తానని ఆయన అన్నారు.

News April 25, 2025

రాజమండ్రి : ‘ప్రేమించి.. ఇప్పుడు వద్దంటున్నాడు’

image

విజయనగరానికి చెందిన యువకుడు తనను ప్రేమించి మోసం చేశాడంటూ రాజమండ్రి యువతి పోలీసులను ఆశ్రయించింది. RJY దేవీచౌక్ సమీపంలోని ఓ కోచింగ్ సెంటర్లో రాంబాబు కాంపిటీటివ్ పరీక్షలకు శిక్షణ పొందుతున్నాడు. అదే కోచింగ్ సెంటర్‌కు వెళ్తున్న యువతి (20)తో ప్రేమ వ్యవహారం నడిపాడు. శారీరంగా లోబర్చుకుని పెళ్లి చేసుకోమంటే కులం పేరుతో అవమానించాడని ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు త్రీ టౌన్ పోలీసులు తెలిపారు.

error: Content is protected !!