News January 22, 2025

రాజమండ్రి: ఉద్యోగం కోసం వెళ్లిన యువకుడు అదృశ్యం

image

ఉద్యోగం చూసుకుంటానని విశాఖపట్నం వెళ్లిన తన కుమారుడు ఇప్పటివరకు తిరిగిరాలేదని హుకుంపేట గ్రామానికి చెందిన రేలంగి శ్రీనివాసరావు మంగళవారం బొమ్మూరు పోలీసులకు పిర్యాదు చేశారు. తన 22ఏళ్ల రేలంగి దేదీప్‌ బిటెక్‌ పూర్తిచేశాడు. గత నెల 20వతేదీన ఉద్యోగం చూసుకుంటానని విశాఖపట్నం వెళ్లాడు. అయితే కొద్దిరోజులుగా అతనిఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వస్తుందని ఫిర్యాదులో తెలిపారు. ఎస్సై రమేష్ కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నారు.

Similar News

News February 16, 2025

కొవ్వూరు: ఏడుగురిపై కేసు నమోదు

image

దొంగతనం చేసి పారిపోతూ కానిస్టేబుల్‌ను వాహనంతో ఢీకొట్టి గాయపర్చిన ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు కొవ్వూరు ఎస్సై కె.జగన్మోహనరావు తెలిపారు. స్కార్పియోను దొంగతనం చేసి విజయవాడ పారిపోతున్నారనే సమాచారంతో కొవ్వూరు దగ్గర మన్ బ్రిడ్జి టోల్‌ప్లాజా సమీపంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రాంబాబు, హెచ్‌సీ లక్ష్మీనారాయణలకు చెప్పారు. వారు అడ్డుకునే క్రమంలో రాంబాబును ఢీకొట్టి పారిపోయారు.

News February 16, 2025

తూ. గో: ఇంటర్ ప్రాక్టికల్స్‌లో 4, 286 మంది హాజరు 

image

తూర్పుగోదావరి జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ప్రాక్టికల్స్ భాగంగా శనివారం నిర్వహించిన జనరల్, ఒకేషనల్ విభాగాలలో 2,439 మందికి 2,378మంది హాజరు అయినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఎన్ ఎస్ వి ఎల్ నరసింహం తెలిపారు. అలాగే మధ్యాహ్నం జరిగిన ఇంటర్ ప్రాక్టికల్స్ లో 1940 మందికి 1908 మంది విద్యార్థులు హాజరైనట్లు ఆర్ ఐ ఓ పేర్కొన్నారు.

News February 16, 2025

తూ.గో: చికెన్ ధరలు ఇవే

image

బర్డ్ ఫ్లూ వచ్చిందనే కారణంగా చికెన్ దుకాణాలు చాలా వరకు మూసివేశారు. దీంతో వాటి ధరలు అమాంతం పడిపోయాయి. మొన్నటి వరకు లైవ్ కిలో రూ.120 ఉండగా అది ప్రస్తుతం రూ.80 నుంచి 90 వరకు ఉంది. ఫారం కోడి ధర లైవ్ రూ.90 పలుకగా ఇప్పుడు రూ.70 అమ్ముతున్నారు. వైద్యులు ఉడకబెట్టిన చికెన్ తినవచ్చు అని చెప్పినా ప్రజలు మొగ్గుచూపడం లేదు.

error: Content is protected !!