News September 9, 2024
రాజమండ్రి: ఉపాధి శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
రాజమండ్రి కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ, యూనియన్ బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో ఉపాధి శిక్షణ కోసం గ్రామీణ యువకుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ సోమవారం తెలిపారు. సెల్ ఫోన్ రిపేర్, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, సెక్యూరిటీ కెమెరా ఏర్పాట్లు సర్వీస్ కోర్సుల్లో ప్రవేశానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల నుండి యువత దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News October 9, 2024
పిఠాపురం అత్యాచార ఘటనలో నిందితుడిపై పోక్సో కేసు
పిఠాపురం మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో నిందితుడిపై పోక్సో కేసు నమోదైంది. కిడ్నాప్ సహ ఆరు సెక్షన్‌ల కింద పిఠాపురం పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధిత బాలిక మేనత్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై విపక్ష నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
News October 9, 2024
తూ.గో జిల్లాలో TODAY TOP NEWS
➣ తూ.గో. పుష్కరాలకు రూ.100 కోట్ల నిధులు కేటాయింపు
➣ ఎమ్మెల్యేలు దోచుకునేందుకే కొత్త మద్యం పాలసీ: భరత్
➣ తూ.గో: నేటి నుంచి ప్రత్యేక రైళ్లు..
➣ పిఠాపురంలో మద్యం తాగించి బాలికపై అత్యాచారం
➣ చేనేత పరిశ్రమ అభివృద్ధిపై సీఎంతో చర్చించిన ఎంపీ తంగేళ్ల
➣ పిఠాపురం బాలిక అత్యాచార నిందితుడిపై పోక్సో కేసు
News October 8, 2024
తూ.గో.జిల్లాకు రూ.100 కోట్ల నిధులు కేటాయింపు
2027 గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని అఖండ గోదావరి ప్రాజెక్ట్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం జిల్లాకు రూ.100 కోట్ల నిధులను కేటాయించిందని టూరిజం అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు ఏర్పాట్లకు, రాజమండ్రి నగరాన్ని ఆకర్షణీయంగా అభివృద్ధి చేయడానికి ఈ నిధులను వినియోగించనున్నారు. ఈ దిశగా సంబంధిత అధికారులు పనులు ప్రారంభించారు.