News February 2, 2025
రాజమండ్రి: ఎమ్మెల్సీగా అఖండ మెజార్టీతో గెలిపించండి

ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎన్నికలలో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మెజారిటీతో తనను గెలిపించాలని ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కోరారు. శనివారం రాజమండ్రిలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అధ్యక్షతన జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునేందుకు కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
Similar News
News February 17, 2025
రాజానగరం: రోడ్డు ప్రమాదంలో తోడికోడళ్లు మృతి

రాజానగరం జాతీయ రహదారిపై దివాన్ చెరువు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కానవరానికి చెందిన ఇద్దరు తోడి కోడళ్లు మృతి చెందారు. గ్రామస్థుల వివరాల మేరకు.. మహిళలు రిప్కో, చంద్రమ్మ నాగేశ్వరరావుతో కలిసి పాలచర్లలో కూలి పనికి వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలో బైక్ పై వస్తున్న వారిని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో అక్కడికక్కడే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన నాగేశ్వరరావుని ఆసుపత్రికి తరలించారు.
News February 17, 2025
RJY: బాలికపై వేధింపులు.. నలుగురిపై పోక్సో కేసు నమోదు

బాలికను ప్రేమ, పెళ్లి పేరిట వేధింపులకు గురి చేసిన నలుగురు వ్యక్తులపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సోమవారం రాజమండ్రి రూరల్ బొమ్మూరు సీఐ కాశీ విశ్వనాథం తెలిపారు. సీఐ వివరాల మేరకు.. బొమ్మూరుకు చెందిన 13 ఏళ్ల బాలికను ఆమె బంధువులు యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని వేధించారు. బాలిక కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
News February 17, 2025
RJY: ఎన్టీఆర్‌ను పరిచయం చేసిన నిర్మాత ఇకలేరు

ఎన్టీఆర్, ఘంటసాల వంటి సినీ ప్రముఖులను వెండితెరకు పరిచయం చేసిన నటి, గాయని, నిర్మాత కృష్ణవేణి (102) ఆదివారం హైదరాబాద్‌లో మరణించారు. ఆమె తూర్పుగోదావరి జిల్లాలోని పంగిడిగూడెం గ్రామంలో 1924లో జన్మించారు. మహిళలు బయటకు రాని కాలంలో భర్తతో కలిసి 1936 శోభనాచలం స్టూడియోను స్థాపించి ‘సతీ అనుసూయ’ చిత్రాన్ని నిర్మించారు. 1948లో మనదేశం సినిమాతో ఎన్టీఆర్‌ను తొలిసారి వెండితెరకు పరిచయం చేశారు.