News November 6, 2024
రాజమండ్రి: ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

ఉభయగోదావరి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉపఎన్నికల షెడ్యూలును ఎన్నికల కమిషన్ ప్రకటించిన దృష్ట్యా నవంబర్ 4 నుంచి జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నవంబర్ 11న నోటిఫికేషన్ విడుదలవుతుందని, 18న నామినేషన్ కు గడువు పూర్తవుతుందన్నారు. 19న నామినేషన్లు పరిశీలన, 21న ఉపసంహరణ ఉంటుందన్నారు. డిసెంబర్ 5న ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు.
Similar News
News November 10, 2025
రాజమండ్రి: ఈ తేదీల్లో లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్

లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ను నవంబర్ 17 నుంచి 30వ తేదీ వరకు జిల్లాలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ప్రకటించారు. మైక్రోబాక్టీరియా లెప్రీ అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే చర్మవ్యాధి పూర్తిగా నయం అవుతుందన్నారు. చర్మంపై స్మర్శలేని మచ్చలు, బొడిపెలు, నరాల సమస్యలు గల వారు సమీపంలోని PHC, CHCలను వెంటనే సంప్రదించాలని సూచించారు. చికిత్స, మందులు ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితమని కలెక్టర్ తెలిపారు.
News November 9, 2025
సబ్సిడీ వాహనాలకు దరఖాస్తుల ఆహ్వానం: ఈడీ

తూ.గో జిల్లాలోని సఫాయి కర్మచారి నిరుద్యోగ యువతకు NSKFDC పథకంలో భాగంగా సబ్సిడీపై సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలు మంజూరు చేస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ జె.సత్యవతి తెలిపారు. అర్హులైన వారు కాకినాడలోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని కోరారు. మరిన్ని వివరాలకు 62818-17023 నంబరును సంప్రదించాలని ఆమె సూచించారు.
News November 9, 2025
తుఫాన్ నష్టం అంచనాకు 10న కేంద్ర బృందం

మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేసేందుకు ఈనెల 10, 11 తేదీల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. హోంమంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ పౌసుమిబసు నేతృత్వంలోని 8 మంది సభ్యుల బృందం, నష్టం, పునరావాస చర్యలపై కేంద్రానికి నివేదిక ఇస్తుందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం తెలిపారు.


