News June 11, 2024

రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌ అభివృద్ధిపై కొత్త ఆశలు

image

శ్రీకాకుళం MP రామ్మోహన్ నాయుడికి కేంద్ర విమానయాన శాఖ దక్కడం, ఏపీలో కూటమి గెలవడంతో రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ అభివృద్ధిపై ఆశలు చిగురిస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలకు ఈ విమానాశ్రయం తలమానికం. దీని విస్తరణతో పాటు రూ.133కోట్లతో టెర్మినల్ భవన నిర్మాణానికి 4ఏళ్ల కిందే మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినా.. ప్రతిపాదనలకే పరిమితయ్యాయి. తాజాగా తెలుగు వ్యక్తి విమానయాన శాఖ మంత్రి కావడంతో ఆశలకు కొత్త రెక్కలొస్తున్నాయి.

Similar News

News November 21, 2025

ప.గో: రూ. 2కోట్లు గోల్ మాల్ ?

image

తణుకులోని ఓ ప్రైవేటు బ్యాంకులో తాకట్టు బంగారం గోల్‌మాల్‌ అయిన వ్యవహారం రాజుకుంటోంది. గతంలో ఇక్కడ పనిచేసిన సిబ్బందితో చేతులు కలిపిన తణుకు శాఖ మేనేజర్‌ ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారాన్ని సొంత అవసరాలకు వాడుకున్న వ్యవహారం తాజాగా వెలుగు చూసింది. ఖాతాదారులు నిలదీయడంతో బ్యాంకు అధికారులు బయట బంగారం కొనుగోలు చేసి ఇచ్చారు. ఇలా సుమారు రూ.2 కోట్లు విలువైన బంగారాన్ని దుర్వినియోగం చేసినట్లు తెలుస్తోంది.

News November 21, 2025

మొగల్తూరులో సినిమా హాల్ పరిశీలించిన జేసీ

image

మొగల్తూరులోని శ్రీదేవి జానకి థియేటర్‌ను జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. పేరు మార్పుపై వచ్చిన విషయంపై థియేటర్‌ను సందర్శించినట్లు ఆయన తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రేక్షకుల సౌకర్యం కోసం యాజమాన్యానికి పలు సూచనలు చేశామన్నారు. థియేటర్‌లో ఎగ్జిట్ బోర్డులు, ఫైర్ సేఫ్టీ, తాగునీరు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ధియేటర్ సిబ్బందికి సూచించారు.

News November 21, 2025

ప.గో: 70 మినీ అంగన్వాడీ కేంద్రాలు మెయిన్ కేంద్రాలుగా మార్పు

image

పశ్చిమగోదావరి జిల్లాలో 70 మినీ అంగన్వాడీ కేంద్రాలు మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మారనున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి డి. లక్ష్మీ తెలిపారు. వీటిలో పనిచేస్తున్న 10వ తరగతి పాసైన 59 మందికి మెయిన్ కార్యకర్తలుగా పదోన్నతి లభిస్తుందని ఆమె అన్నారు. దీంతో వారి గౌరవ వేతనం రూ.7 వేల నుంచి రూ.11,500 లకు పెరుగుతుందని లక్ష్మీ తెలియజేశారు.