News June 11, 2024
రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ అభివృద్ధిపై కొత్త ఆశలు

శ్రీకాకుళం MP రామ్మోహన్ నాయుడికి కేంద్ర విమానయాన శాఖ దక్కడం, ఏపీలో కూటమి గెలవడంతో రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ అభివృద్ధిపై ఆశలు చిగురిస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలకు ఈ విమానాశ్రయం తలమానికం. దీని విస్తరణతో పాటు రూ.133కోట్లతో టెర్మినల్ భవన నిర్మాణానికి 4ఏళ్ల కిందే మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినా.. ప్రతిపాదనలకే పరిమితయ్యాయి. తాజాగా తెలుగు వ్యక్తి విమానయాన శాఖ మంత్రి కావడంతో ఆశలకు కొత్త రెక్కలొస్తున్నాయి.
Similar News
News March 26, 2025
రాజమండ్రి: సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం తేదీ మార్పు

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు శాసనమండలి సభ్యునిగా ప్రమాణస్వీకార కార్యక్రమంలో తేదీ మార్పు జరిగినట్లు బుధవారం రాజమండ్రిలో ఒక ప్రకటన ద్వారా తెలిపారు. గతంలో తెలిపిన విధంగా ఏప్రిల్ 3వ తేదీకి బదులుగా 2వ తేదీకి మార్చినట్లు వెల్లడించారు. కావున పార్టీ నాయకులు, కార్యకర్తలు గమనించాలని కోరారు. ఏప్రిల్ 2వ తేదీ ఉదయం 10 గంటలకి అమరావతిలో శాసనమండలి వద్ద ప్రమాణ స్వీకారం జరుగుతుందన్నారు.
News March 26, 2025
రాజమండ్రి: పాస్టర్ మరణంపై ప్రభుత్వం విచారణకు ఆదేశం

పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణంపై రాజమండ్రి ఆసుపత్రి ఎదుట తీవ్రస్థాయిలో ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ బుధవారం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, సంతాపం తెలిపారు. ఆయన మరణంపై వ్యక్తమవుతున్న అనుమానాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. ఈ అంశంపై.. ఎవరూ రాజకీయంగా, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించొద్దని కోరారు.
News March 26, 2025
నల్లజర్ల : శిశువు మృతి

నల్లజర్ల ముళ్ల పొదల్లో అప్పుడే పుట్టిన ఆడ శిశువును కుక్కలు పీకుతుండగా.. స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. అనంతరం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే శిశువు చికిత్స పొందుతూ రా.12 గం.లకు మరణించిందని సీడీపీఓ నాగలక్ష్మి తెలిపారు. ఘటనపై FIR చేయించామని, వివరాల సేకరణకు అంగనవాడీ సిబ్బందికి ఆదేశాలిచ్చామన్నారు.