News December 24, 2024

రాజమండ్రి: కళ్ల ముందే కొడుకు మృతి.. రోదించిన తల్లి

image

రాజమండ్రిలో రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు పిడింగొయ్యికి చెందిన నరేశ్ (20) అనే వ్యక్తి తన తల్లితో కలిసి బైక్‌పై వెళ్తుండగా కవలగొయ్యి జంక్షన్ వద్ద లారీ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన నరేశ్ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. దీంతో తల్లి రోదన చూపరులకు కన్నీరు తెప్పించింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు బొమ్మూరు పోలీసులు తెలిపారు.

Similar News

News December 9, 2025

క్రీడలు మానసిక ఉల్లాసాన్నిస్తాయి: కలెక్టర్ కీర్తి

image

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. రాజమహేంద్రవరం దానవాయిపేటలోని ఎస్‌కెవిటి కళాశాలలో మంగళవారం సీడబ్ల్యూఎస్‌ఎన్ (CWSN) జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. నగర పాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా జెండా ఊపి ఈ పోటీలను ప్రారంభించారు. ఆటల్లో విజేతలకు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి బహుమతులు అందజేశారు.

News December 9, 2025

ప్రత్యేక అవసరాలు గల పిల్లల్లో క్రీడల ద్వారా ప్రతిభ: కలెక్టర్

image

ప్రత్యేక అవసరాలు గల పిల్లల్లో నమ్మకం, ధైర్యం, ప్రతిభను వెలికి తీయడంలో క్రీడలు కీలకపాత్ర పోషిస్తాయని కలెక్టర్ కీర్తి చేకూరి, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా అన్నారు. రాజమండ్రిలోని ఎస్‌కేవీటీ కళాశాల ఆవరణలో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీలను కమిషనర్ ప్రారంభించారు. ప్రత్యేక ప్రతిభావంతులైన చిన్నారుల్లో అపారమైన సృజనాత్మకత, ప్రత్యేక కౌశలాలు దాగి ఉన్నాయని వారు పేర్కొన్నారు.

News December 9, 2025

రతన్ టాటా హబ్‌లో ‘స్పార్క్’ కార్యక్రమం ప్రారంభం

image

రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరులోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో మంగళవారం స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్ ఫర్ అడ్వాన్స్‌డ్ & రియల్‌టైమ్ నాలెడ్జ్ (‘స్పార్క్’) కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ వై.మేఘా ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ ‘వన్ ఫ్యామిలీ-వన్ ఎంట్రప్రెన్యూర్’ లక్ష్యాన్ని, ఇన్నోవేషన్ హబ్ దృష్టికోణాన్ని చేరుకోవడానికి ఈ ‘స్పార్క్’ కార్యక్రమం కీలక వేదికగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.