News December 24, 2024
రాజమండ్రి: కళ్ల ముందే కొడుకు మృతి.. రోదించిన తల్లి
రాజమండ్రిలో రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు పిడింగొయ్యికి చెందిన నరేశ్ (20) అనే వ్యక్తి తన తల్లితో కలిసి బైక్పై వెళ్తుండగా కవలగొయ్యి జంక్షన్ వద్ద లారీ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన నరేశ్ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. దీంతో తల్లి రోదన చూపరులకు కన్నీరు తెప్పించింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు బొమ్మూరు పోలీసులు తెలిపారు.
Similar News
News January 16, 2025
అసలు ఎవరీ రత్తయ్య..?
సంక్రాంతి నేపథ్యంలో ఉభయగోదావరి జిల్లాల్లో వేలల్లో పందేలు జరిగాయి. వందల కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఈసారి తాడేపల్లిగూడెంలో ఏకంగా రూ.1.25 కోట్ల పందెం జరిగింది. కోడిపందేల్లో పేరు మోసిన రత్తయ్య పుంజు, గుడివాడ ప్రభాకర్ పుంజు మధ్య రసవత్తరంగా పందెం జరిగింది. ఎంతో పేరు మోసిన రత్తయ్య పుంజు ఓడిపోవడంతో అందరూ ఖంగుతిన్నారు. అసలు ఎవరీ రత్తయ్య అని ఆరా తీయగా.. ఆయనది లింగపాలెం మండలం రంగాపురం అని తేలింది.
News January 15, 2025
గోసాల ప్రసాద్ మృతి
ప్రముఖ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు గోసాల ప్రసాద్ బుధవారం తెల్లవారుజామున కాకినాడలోని ఆయన స్వగృహంలో మృతి చెందారు. గత కొంత కాలంగా కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఇంటి నుంచి బయటకు వస్తుండగా ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబీకులు తెలిపారు.
News January 15, 2025
తూ.గో: పందేలలో పచ్చకాకిదే హవా
ఉభయగోదావరి జిల్లాల్లో సంక్రాంతి వేళ కోడి పందేల జోరు మామూలుగా లేదు. అయితే అదృష్టాన్ని, సత్తాను పరీక్షించుకునే ఈ కోడి పందేలకు సైతం శాస్త్రాలు, ముహూర్తాలు ఉంటాయని పందెం రాయుళ్లు చెబుతున్నారు. ఈ మేరకు కుక్కుట శాస్త్రం ప్రకారం మంగళవారం జరిగిన కోడి పందేల్లో పచ్చ కాకి రంగు కోడి పుంజులు ఎక్కువగా గెలుపొందినట్లు తెలుస్తోంది.