News January 25, 2025
రాజమండ్రి : కాంట్రాక్టర్ దారుణ హత్య

రాజమండ్రి కంబాలచెరువు సెంటర్ సమీపంలో ఇన్ కమ్ టాక్స్ కార్యాలయం వద్ద కొంతమూరు గ్రామానికి చెందిన సెంట్రింగ్ కాంట్రాక్టర్ కిలాని పోతురాజు(48) శుక్రవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. బైక్ పై వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలైన అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు త్రీ టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News November 25, 2025
హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి: సిద్దరామయ్య

CM మార్పు విషయంలో గందరగోళానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలని కర్ణాటక సీఎం సిద్దరామయ్య పేర్కొన్నారు. ఢిల్లీకి వెళ్లే స్వేచ్ఛ ఎమ్మెల్యేలకు ఉందని, వారు తమ అభిప్రాయాలు చెప్పుకోవచ్చని అన్నారు. అధిష్ఠానం నుంచి సిగ్నల్ రాగానే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపడతామని పేర్కొన్నారు. మరోవైపు తాను పార్టీ నుంచి ఏమీ డిమాండ్ చేయడం లేదని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్పారు.
News November 25, 2025
UIDAIలో టెక్నికల్ కన్సల్టెంట్ ఉద్యోగాలు

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(<
News November 25, 2025
నల్గొండ: రైతు భరోసా కోసం రైతుల ఎదురుచూపులు

నల్గొండ జిల్లాలో యాసంగి పంట సాగుకు సిద్ధమవుతున్న 10.82 లక్షల మంది రైతులు రైతు భరోసా పథకం పెట్టుబడి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. వానాకాలం, యాసంగి పంటలకు కలిపి ప్రభుత్వం ఏటా రూ.12,000 అందిస్తుంది. అయితే, ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో విడుదల కావాల్సిన ఈ యాసంగి సహాయం ఇప్పటివరకు రాకపోవడంతో రైతులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు.


