News April 2, 2025
రాజమండ్రి: కోర్టు సంచలన తీర్పు

మైనర్ కుమార్తెపై అత్యాచారం కేసులో నేరం రుజువు కావడంతో న్యాయ స్థానం నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షను విధించినట్లు చాగల్లు ఎస్సై కె. నరేంద్ర తెలిపారు. ఆయన వివరాల ప్రకారం..చాగల్లు మండలంలో 2020లో తన మైనర్ కుమార్తెపై ఆమె తండ్రి అత్యాచారం చేయగా గర్భం దాల్చింది. అప్పటి డీఎస్పీ రాజేశ్వరి అరెస్ట్ చేశారు. కేసులో న్యాయస్థానం తండ్రికి యావజ్జీవ శిక్ష, రూ.5 వేలు జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పునిచ్చింది.
Similar News
News December 16, 2025
విద్యుత్.. అమూల్య సంపద: కలెక్టర్

జాతీయ ఇంధన వారోత్సవాల సందర్భంగా రాజమండ్రి కలెక్టరేట్‌లో మంగళవారం తూర్పు గోదావరి కలెక్టర్ కీర్తి చేకూరి ప్రచార చిత్రాలను ఆవిష్కరించారు. విద్యుత్‌ను కేవలం ప్రకృతి వనరుగా కాకుండా, అమూల్యమైన సంపదగా భావించాలని ప్రజలకు ఆమె హితవు పలికారు. అవసరమైన మేరకే వినియోగిస్తూ, ఇంధన పొదుపును ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
News December 16, 2025
గోపాలపురం: వెంటాడుతూనే వున్న పెద్దపులి భయం

గోపాలపురం మండలం భీమోలు పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచారంపై ఉత్కంఠ కొనసాగుతోంది. పులి ఆచూకీ కోసం కొండ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు ఆరు ట్రాకింగ్ కెమెరాలను ఏర్పాటు చేసి గాలింపు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు కెమెరాల్లో పులి జాడలు లభించలేదని డీఎఫ్‌ఓ దావీదు రాజు సోమవారం తెలిపారు. పులి ఇంకా పరిసరాల్లోనే ఉండే అవకాశం ఉన్నందున గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.
News December 15, 2025
రాజమండ్రి: పీజీఆర్‌ఎస్‌కు 23 అర్జీలు

తూర్పుగోదావరి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు 23 అర్జీలు అందాయి. జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ స్వయంగా బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యల తీవ్రతను బట్టి సంబంధిత పోలీసు స్టేషన్ల అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చట్టపరంగా విచారణ జరిపి, బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.


