News April 5, 2025

రాజమండ్రి: గర్భిణిగా నాటకం ఆడిన మహిళ.. ఏమైందంటే?

image

గొడ్రాలు అనే నింద పడుతుందనే భయంతో ఓ వివాహిత గర్భణిగా నాటకం ఆడింది. పోలీసులు వివరాల ప్రకారం..దేవిపట్నం(M) ఇందుకూరిపేటకి చెందిన కొప్పిశెట్టి సంధ్యారాణిని గురువారం డెలివరీ కోసం ఆసుపత్రికి తీసుకువచ్చారు. తాను గర్భిణి కాదని తెలుస్తుందనే భయంతో ఆసుపత్రి నుంచి వెళ్లిపోయింది. కాకినాడలో ఆమె ఆచూకీ గుర్తించి విచారించగా.. 9నెలలు గుడ్డ ముక్కలు పెట్టుకుని గర్భం పెరుగుతున్నట్లు నమ్మించినట్లు ఆమె తెలిపింది.

Similar News

News December 22, 2025

కామారెడ్డిలో ప్రజావాణి

image

కామారెడ్డి కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. సబ్ కలెక్టర్ డా.కిరణ్మయి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఫిర్యాదులను వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేసి, బాధితులకు రసీదులు అందజేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సత్వరమే పరిష్కరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ చందర్, ట్రైనీ కలెక్టర్ మరియు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

News December 22, 2025

PCOSని ఎలా కంట్రోల్ చెయ్యాలంటే?

image

పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ఇటీవల మహిళల్లో ఎక్కువగా కనిపిస్తోంది. వయసు, బరువుతో సంబంధం లేకుండా ఎవరైనా దీని బారిన పడొచ్చని నిపుణులు చెబుతున్నారు. దీన్ని అదుపులో ఉంచుకోవాలంటే సరైన బరువును మెయింటైన్ చేయడం, మైండ్ ఫుల్ ఈటింగ్, క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యడం, వైద్య పరీక్షలు చేయించుకోవడం, అవసరమైన మందులు వాడటం, నిద్రలేమి, దీర్ఘకాలిక ఒత్తిడి తగ్గించుకోవాలని సూచిస్తున్నారు.

News December 22, 2025

శబరిమల భక్తులకు ‘కేరళ సద్య’

image

శబరిమలలో అయ్యప్ప భక్తులకు సంప్రదాయ కేరళ సద్య(విశేష విందు) పంపిణీ ప్రారంభమైంది. దేవస్వం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దీపప్రజ్వలన చేసి స్వామికి నివేదించారు. అనంతరం భక్తులకు వడ్డించారు. ఇందులో రైస్, పప్పు, సాంబార్, రసం, రెండు రకాలు కేరళ స్టైల్ కర్రీస్, పచ్చడి, అప్పడం, పాయసం వంటి వంటకాలు ఉంటాయి. రోజుకు 5,000 మందికిపైగా భక్తులకు రోజు విడిచి రోజు సద్య, మధ్యలో పులావ్‌ను భక్తులకు వడ్డించనున్నారు.