News April 5, 2025
రాజమండ్రి: గర్భిణిగా నాటకం ఆడిన మహిళ.. ఏమైందంటే?

గొడ్రాలు అనే నింద పడుతుందనే భయంతో ఓ వివాహిత గర్భణిగా నాటకం ఆడింది. పోలీసులు వివరాల ప్రకారం..దేవిపట్నం(M) ఇందుకూరిపేటకి చెందిన కొప్పిశెట్టి సంధ్యారాణిని గురువారం డెలివరీ కోసం ఆసుపత్రికి తీసుకువచ్చారు. తాను గర్భిణి కాదని తెలుస్తుందనే భయంతో ఆసుపత్రి నుంచి వెళ్లిపోయింది. కాకినాడలో ఆమె ఆచూకీ గుర్తించి విచారించగా.. 9నెలలు గుడ్డ ముక్కలు పెట్టుకుని గర్భం పెరుగుతున్నట్లు నమ్మించినట్లు ఆమె తెలిపింది.
Similar News
News April 22, 2025
కామారెడ్డి: NH-44పై యాక్సిడెంట్

బిక్కనూర్ శివారులోని NH-44పై ప్రమాదం జరిగింది. టాటాఏస్ బోల్తా పడి13 మందికి గాయాలయ్యాయి. గద్వాల జిల్లాకు చెందిన కొందరు బాసరలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. తిరుగుప్రయాణంలో వారి వాహనం బిక్కనూర్ బైపాస్ వద్ద ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ ఘటనలో 13 మందికి స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు గమనించి గాయపడ్డవారిని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
News April 22, 2025
కృష్ణా : పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు పటిష్ఠ ఏర్పాట్లు – DRO

కృష్ణా జిల్లాలో ఈ నెల 30వ తేదీన జరగనున్న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షల నిర్వహణకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై సోమవారం తన ఛాంబర్‌లో అధికారులతో ఆయన సమీక్షించారు.10 పరీక్షా కేంద్రాల్లో 4546 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు.
News April 22, 2025
తొలి పునరుత్పాదక ఇంధన రాజధానిగా అమరావతి

అమరావతిని ప్రపంచంలో తొలి పునరుత్పాదక ఇంధన రాజధానిగా అభివృద్ధి చేయాలన్న దిశగా చర్యలు వేగవంతం చేశారు. 2050 నాటికి 2,700 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యంగా ప్రభుత్వం ముందడుగు వేసింది. ప్రభుత్వం నిర్మించే ఇళ్లలో 1/3 పైకప్పు సోలార్ ప్యానెల్లకు కేటాయించనున్నారు. ప్రభుత్వ భవనాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు సోలార్ తప్పనిసరి. ఇప్పటికే 415 కిలోవాట్ల సోలార్ ప్యానెల్లు 16 కేంద్రాల్లో ఏర్పాటు అయ్యాయి.