News September 28, 2024
రాజమండ్రి: చిరుత కనిపించలేదు: DFO
కడియం మండలం బుర్రిలంక పరిసరాల్లో అమర్చిన ట్రాప్, సీసీ కెమెరాల్లో చిరుత కదలికలు ఇంకా గుర్తించలేదని, పాదముద్రలు కూడా కనిపించలేదని జిల్లా అటవీ శాఖాధికారిని భరణి శనివారం తెలిపారు. దివాన్ చెరువు ప్రాంతంలో కూడా ఏ విధమైన సమాచారం లభించలేదన్నారు. బుర్రిలంక సమీపంలోని గోదావరి లంకల్లో జింకలు ఉన్న నేపథ్యంలో చిరుత అటు వైపు వెళ్లి ఉండవచ్చని అనుమానిస్తున్నామన్నారు. రేపటి నుంచి ఆ ప్రాంతాల్లో గాలిస్తామన్నారు.
Similar News
News October 5, 2024
తునిలో కిలో టమాటాలు రూ.100
ఎన్నడూ లేని విధంగా కూరగాయల ధరలు కొండెక్కి కూర్చోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నామన్నారు. శనివారం తుని మార్కెట్లో కిలో టమాటాలు రేటు వందకు చేరువలో ఉంది. ఉల్లిపాయలు రూ.50, బీరకాయ రూ.60, చిక్కుడుకాయ రూ .100, క్యాప్సికం రూ.90, మిర్చి రూ.40, అనపకాయలు రూ.30, బోబ్బురి చిక్కుళ్లు రూ.60 పలుకుతున్నట్లు వ్యాపారస్థులు చెబుతున్నారు.
News October 5, 2024
రాజమండ్రి: రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ యువతి మృతి
నిడదవోలుకు చెందిన దీప్తి రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. పోలీసుల కథనం..సూరంపాలెం ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతోంది. ఫ్రెండ్స్‌తో రాజమండ్రి చూసి వస్తానని శుక్రవారం ఇంట్లో చెప్పి వచ్చింది. 9 మంది 4 బైకులపై బయలుదేరారు. కోరుకొండ నారసింహున్ని దర్శించుకుని వస్తూ.. బూరుగుపూడి జంక్షన్ వద్ద బైకు నడుపుతున్న దీప్తి, టాటా ఏసీని ఢీకొట్టి ప్రాణాలు విడిచింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News October 5, 2024
తూ.గో.జిల్లాలో 125మద్యం దుకాణాలకు నోటిఫికేషన్
తూర్పు గోదావరి జిల్లాలోని ఏడు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 125 మద్యం దుకాణాలకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశామని ఎక్సైజ్ జిల్లా అధికారి లావణ్య శుక్రవారం తెలిపారు. కొవ్వూరు మున్సిపాలిటీలో మూడు, మండలంలో 5, నిడదవోలు పురపాలక సంఘంలో నాలుగు, మండలంలో 5, చాగల్లు మండలంలో నాలుగు, తాళ్లపూడి మండలంలో నాలుగు, నల్లజర్లలో ఆరు దుకాణాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఆన్ లైన్‌లో దరఖాస్తు చేయవచ్చన్నారు.