News March 2, 2025

రాజమండ్రి: చెక్కు అందజేసిన ఎమ్మెల్యే గోరంట్ల

image

రాజమండ్రి రూరల్ రాజవోలు గ్రామానికి చెందిన సోడదాసి రమణ, కీర్తన దంపతుల కుమార్తె అనారోగ్యంతో బాధపడుతుంది. పేద దంపతులు అయిన వీరు అప్పులు బారిన పడి సతమవుతున్న స్థితిలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి దృష్టికి తీసుకువెళ్లారు. ఎంతో ఎమ్మెల్యే స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.10 లక్షలు మంజూరు చేసి నేడు చెక్కును అందజేశారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, నర్సిపల్లి హారిక తదితరులు ఉన్నారు.

Similar News

News March 3, 2025

రాజమండ్రి: హత్య కేసులో జీవిత ఖైదు

image

2021 సెప్టెంబర్‌లో  రాజమండ్రిలోని సీటీఆర్ఐ సెంటర్ వద్ద జరిగిన హత్య కేసులో ఒక నేరస్థుడికి సోమవారం కోర్టు శిక్ష విధించింది. వాద ప్రతివాదనలు విన్న తర్వాత జడ్జి ఆర్.శ్రీలత ముద్దాయి యర్రా సాయికి జీవితకాలం ఖైదు అలాగే రూ. 20 వేల జరిమానా విధించింది. ఈ కేసు పురోగతిలో సహకరించిన పీపీ రాధాకృష్ణరాజు, త్రీ టౌన్ సీఐ అప్పారావు, ఏఎస్ఐ వెంకటేశ్వర్లులను, ఎస్పీ నర్సింహ కిషోర్‌ను కోర్టు అభినందించింది.

News March 3, 2025

రాజమండ్రి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

రాజమండ్రి గామన్ బ్రిడ్జిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్‌పై వెళుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. రాజానగరం పోలీసుల వివరాలు.. తొర్రేడుకు చెందిన నరేంద్ర (45) పొలం పనులు ముగించుకొని ఇంటికి వస్తుండగా లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని SI మనోహర్ తెలిపారు.

News March 3, 2025

తూ.గో: నేడే కౌంటింగ్.. జిల్లాలో ఉత్కంఠ

image

ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ MLC ఎన్నికల లెక్కింపు నేడు జరగనుంది. 35 మంది అభ్యర్థులు పోటీ చేయగా 27న జరిగిన పోలింగ్‌లో 63.26% ఓటింగ్ నమోదైంది. సోమవారం ఏలూరు సీఆర్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో జరిగే కౌంటింగ్‌కు అధికారులు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం 28 టేబుల్‌లను ఏర్పాటు చేశారు. 17 రౌండ్లలో లెక్కింపు జరగనుంది. మరి కొన్నిగంటల్లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ వీడనుంది.

error: Content is protected !!