News February 19, 2025
రాజమండ్రి: జగన్ జైలుకు వెళ్లడం ఖాయం: గన్ని కృష్ణ

చేసిన తప్పుకు జైలు ఊచలు లెక్కపెడుతున్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బాటలోనే జగన్ జైలుకు వెళ్ళడం ఖాయమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ జోస్యం చెప్పారు. భవిష్యత్లో తాను వెళ్ళబోతున్న జైల్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయో పరిశీలించుకోడానికి జగన్ వెళ్ళాడా అనే అనుమానాలు ఉన్నాయన్నారు. నాడు చంద్రబాబును అక్రమంగా జైల్లో పెట్టిన రోజులను మరిచిపోయినట్లుగా జగన్ నీతులు చెబితే ఎలా అని గన్ని ఎద్దేవా చేశారు.
Similar News
News October 22, 2025
అనిత సహనం కోల్పోతే పవన్కు గడ్డు పరిస్థితులు: మేడా

పిఠాపురంలో జరుగుతున్న నేరాలపై దృష్టి సారించకుండా, భీమవరంలో జూదాల కోసం డీఎస్పీ జయసూర్యపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అవ్వడం హాస్యాస్పదమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం రాజమండ్రిలో ఆయన మాట్లాడారు. హోం మంత్రి అనిత శాఖనే పవన్ కళ్యాణ్ ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. అనిత సహనం కోల్పోతే పవన్కు గడ్డు పరిస్థితులు తప్పవన్నారు.
News October 22, 2025
కడియం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

జాతీయ రహదారి 216ఏపై కడియపులంక వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విశాఖపట్నం జిల్లా గాజువాక అగనంపూడికి చెందిన దాసరి కిరణ్ కుమార్ (26) మృతి చెందాడు. విజయవాడ నుంచి కారులో వస్తున్న కిరణ్ కుమార్, రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. తీవ్ర గాయాలైన కిరణ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News October 21, 2025
రాజమండ్రిలో ‘పోలీస్ కమేమరేషన్ డే’

రాజమండ్రిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మంగళవారం నిర్వహించిన ‘పోలీస్ కమేమరేషన్ డే’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అమరులైన పోలీసు సిబ్బందికి ఘన నివాళులు అర్పించారు. మంత్రి కందుల దుర్గేశ్, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ పాల్గొని అమరులకు పుష్పాంజలి ఘటించారు. సమాజంలో శాంతి భద్రతలను కాపాడటంలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని మంత్రి కందుల అన్నారు.