News March 16, 2025
రాజమండ్రి: జన్మభూమి ఎక్స్ప్రెస్ దారి మళ్లింపు

విశాఖపట్నం -లింగంపల్లి, లింగంపల్లి- విశాఖపట్నం మధ్య రోజు నడిచే రైళ్లు శాశ్వత ప్రాతిపదికన దారి మళ్లించడం జరిగిందని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జన్మభూమి ఎక్సెప్రెస్ గోదావరి జిల్లాల ప్రజలకు ముఖ్య రవాణాగా ఉంది. నేటి నుంచి చర్లపల్లి – అమ్ము గూడ – సనత్ నగర్ మీదుగా దారి మళ్లించామని పేర్కొన్నారు. ఏప్రిల్ 25వ తారీకు వరకు సికింద్రాబాద్ వెళ్లదని రైల్వే అధికారులు తెలిపారు.
Similar News
News October 28, 2025
తూ.గో: పునరావాస కేంద్రాలకు 361 కుటుంబాల తరలింపు

తుఫాను నేపథ్యంలో తూ.గో జిల్లా వ్యాప్తంగా 361 కుటుంబాలు, 1193 మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్న మండలాల్లో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నారని చెప్పారు. శిబిరాల్లో తాగునీరు, ఆహారం, వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.
News October 28, 2025
తూ.గో జిల్లా స్కూళ్లకు రేపు సెలవు

తుఫాను ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని స్కూళ్లకు బుధవారం కూడా సెలవు ఇచ్చామని డీఈవో కె.వాసుదేవరావు వెల్లడించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎవరైనా స్టడీ క్లాసులు, అదనపు తరగతుల పేరుతో పాఠశాలలు నిర్వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News October 28, 2025
రాజమండ్రి: BSNL వినియోగదారులకు గమనిక

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో BSNL నెట్వర్క్ సక్రమంగా పనిచేసేలా అన్ని చర్యలు తీసుకున్నామని ఆ సంస్థ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పలివెల రాజు ఓ ప్రకటనలో తెలిపారు. అవసరమైన చోట్ల మొబైల్ జనరేటర్లు, ఏడు డివిజన్లలో ఏడు టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. తుఫాన్ సమయంలో నెట్వర్క్ ఇబ్బందులు తలెత్తితే వినియోగదారులు 0883-2472200కు కాల్ చేయాలని కోరారు.


