News July 12, 2024
రాజమండ్రి: జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్రలకు ప్రత్యేక రైళ్లు

ఉత్తరాఖండ్ యాత్ర, జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్రలకు భారత్ గౌరవ యాత్ర స్పెషల్ రైళ్లు ఆగస్టు 4, 8 తేదీల్లో నడుపుతున్నామని IRCTC ఏరియా మేనేజర్ రాజా గురువారం తెలిపారు. రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ లో రైళ్ల వివరాల బ్రోచర్లను స్టేషన్ మేనేజర్ రంగనాథ్, సీటీఐ చంద్రమౌళితో కలిసి ఆవిష్కరించారు. ఉత్తరాఖండ్ యాత్ర ఆగస్టు 8న విశాఖపట్నంలో బయలు దేరి రాజమహేంద్రవరం వస్తుందన్నారు. 11 రోజులు యాత్ర సాగుతుందన్నారు.
Similar News
News February 17, 2025
రాజానగరం: రోడ్డు ప్రమాదంలో తోడికోడళ్లు మృతి

రాజానగరం జాతీయ రహదారిపై దివాన్ చెరువు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కానవరానికి చెందిన ఇద్దరు తోడి కోడళ్లు మృతి చెందారు. గ్రామస్థుల వివరాల మేరకు.. మహిళలు రిప్కో, చంద్రమ్మ నాగేశ్వరరావుతో కలిసి పాలచర్లలో కూలి పనికి వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలో బైక్ పై వస్తున్న వారిని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో అక్కడికక్కడే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన నాగేశ్వరరావుని ఆసుపత్రికి తరలించారు.
News February 17, 2025
RJY: బాలికపై వేధింపులు.. నలుగురిపై పోక్సో కేసు నమోదు

బాలికను ప్రేమ, పెళ్లి పేరిట వేధింపులకు గురి చేసిన నలుగురు వ్యక్తులపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సోమవారం రాజమండ్రి రూరల్ బొమ్మూరు సీఐ కాశీ విశ్వనాథం తెలిపారు. సీఐ వివరాల మేరకు.. బొమ్మూరుకు చెందిన 13 ఏళ్ల బాలికను ఆమె బంధువులు యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని వేధించారు. బాలిక కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
News February 17, 2025
RJY: ఎన్టీఆర్‌ను పరిచయం చేసిన నిర్మాత ఇకలేరు

ఎన్టీఆర్, ఘంటసాల వంటి సినీ ప్రముఖులను వెండితెరకు పరిచయం చేసిన నటి, గాయని, నిర్మాత కృష్ణవేణి (102) ఆదివారం హైదరాబాద్‌లో మరణించారు. ఆమె తూర్పుగోదావరి జిల్లాలోని పంగిడిగూడెం గ్రామంలో 1924లో జన్మించారు. మహిళలు బయటకు రాని కాలంలో భర్తతో కలిసి 1936 శోభనాచలం స్టూడియోను స్థాపించి ‘సతీ అనుసూయ’ చిత్రాన్ని నిర్మించారు. 1948లో మనదేశం సినిమాతో ఎన్టీఆర్‌ను తొలిసారి వెండితెరకు పరిచయం చేశారు.