News March 7, 2025
రాజమండ్రి : డ్రంక్ &డ్రైవ్ కేసులో ఒకరికి జైలు శిక్ష.. 29 మందికి జరిమానా

రాజమండ్రిలో నిర్వహించిన డ్రంక్ & డ్రైవ్ కేసులో పట్టుబడ్డ 30 మందికి కోర్టు శిక్ష విధించిందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. గురువారం రాజమండ్రి కోర్టులో వీరిని హాజరుపరచగా జడ్జి సి.రమ్య ఆధ్వర్యంలో 29 మందికి ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున రూ.2.90లక్షలు జరిమానా, ఒకరికి రెండు రోజులు జైలు శిక్ష విధించింది.
Similar News
News March 21, 2025
తూ.గో జిల్లాలో ఠారెత్తిస్తున్న ఎండలు

తూ.గో జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో పల్లెల్లోని వీధులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. కాగా రాజమండ్రిలో 36 డిగ్రీలు, గోపాలపురం 32 డిగ్రీలు, కొవ్వూరు 36 డిగ్రీలు నమోదైంది. వడదెబ్బ తగలకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
News March 21, 2025
రైలు నుంచి జారిపడి బిక్కవోలు వాసి మృతి

భీమడోలు రైల్వే స్టేషన్ సమీపంలో కదులుతున్న రైలు నుంచి ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి గురువారం జారిపడి మృతి చెందాడని రైల్వే ఎస్ఐ సైమన్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. తూ.గో జిల్లా బిక్కవోలుకు చెందిన అంబటి సుబ్బా రెడ్డి (69) సింహాద్రి రైల్లో రాజమండ్రి వైపు వెళుతున్న సమయంలో జారిపడి మృతి చెందాడన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు.
News March 21, 2025
‘లబ్ధిదారులకు అదనపు సహాయం రూ.6.19 కోట్లు విడుదల’

జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గృహ నిర్మాణం కోసం అదనపు ఆర్థిక సహాయం కింద 4,240 మంది లబ్ధిదారులకు రూ.6.19 కోట్ల నిధులను విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి గురువారం తెలిపారు. క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బందికి ఎఫ్‌టీఓ విడుదల చేసిన లబ్ధిదారులు గృహ నిర్మాణాల పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆదేశాలు జారీ చేశారు.