News April 1, 2025

రాజమండ్రి: తప్పుడు దుష్ప్రచారాలు చేస్తున్న వ్యక్తి అరెస్ట్

image

పాస్టర్ ప్రవీణ్ మరణంపై సోషల్ మీడియాలో వివిధ రకాలుగా తప్పుడు దుష్ప్రచారాలు చేస్తున్న రాజమహేంద్రవరం లలితా నగర్‌కు చెందిన దేవాబత్తుల నాగ మహేశ్‌ని త్రీటౌన్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. పూర్తిగా సమాచారం తెలియకుండా తప్పుడు వార్తలు, ఫేక్ వీడియోలను ప్రచారం చేసినా, మతపరమైన గొడవలకు ఆస్కారం కలిగే విధంగా సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ అప్పారావు హెచ్చరించారు.

Similar News

News April 8, 2025

పీజీఆర్ఎస్ అర్జీలు పరిష్కారం ఒక ఎండార్స్‌మెంట్ కారాదు: కలెక్టర్

image

పీజీఆర్ఎస్ అర్జీలు పరిష్కారం ఒక ఎండార్స్‌మెంట్ కారదని, అందులో సంబంధించిన ఉత్తర్వులు కచ్చితంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుంచి ఆర్డీవో, తహశీల్దార్లు, మండల సర్వే అధికారులతో సమావేశం అయ్యారు. రెవెన్యూ అర్జీలు, వాటి పరిష్కార విధానం, ఐవీఆర్‌ఎస్ ఫిర్యాదులపై ప్రతిస్పందన వ్యవస్థపై చర్చించారు.

News April 8, 2025

నల్లజర్ల: పిడుగుపాటుకు ఒకరి మృతి

image

నల్లజర్ల మండలంలోని కృష్ణం గూడెం గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఈదురుగాలులు వీచిన సమయంలో మామిడి చెట్టు కింద ఉన్న వెలగని సత్యనారాయణ అనే వ్యక్తిపై పిడుగు పడి మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. ఈ దుర్ఘటన సోమవారం సాయంత్రం జరిగినట్లు తెలుస్తోంది. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

News April 8, 2025

రాజమండ్రి: జిల్లా మీదుగా 16 సమ్మర్ వీక్లీ స్పెషల్ రైళ్లు

image

జిల్లా మీదగా 16 వీక్లీ సమ్మర్‌ స్పెషల్‌ ట్రైన్‌ ఏర్పాటు చేస్తూ రైల్వే అధికారులు మంగళవారం ప్రకటించారు. 07325 హుబ్లీ– కటీయార్‌ (బుధ) నడిచే ఈరైలు ఈనెల 9నుంచి 30వ తేదీ వరకు, 07326 కటియార్‌–హుబ్లీ (శని) నడిచే ఈ రైలు 12 నుంచి మే 3వరకు, 06559 ఎస్‌ఎంవీటీ బెంగళూరు– నారంగ్ (మంగళ) నడిచే ఈ రైలు ఈనెల 29 వరకు, 06560 నారంగ్ – ఎస్‌ఎంవీటీ బెంగళూరు (శని) నడిచే ఈనెల 12నుంచి మే 3 వరకు అందుబాటులో ఉంటుందన్నారు.

error: Content is protected !!