News April 1, 2025

రాజమండ్రి: తప్పుడు దుష్ప్రచారాలు చేస్తున్న వ్యక్తి అరెస్ట్

image

పాస్టర్ ప్రవీణ్ మరణంపై సోషల్ మీడియాలో వివిధ రకాలుగా తప్పుడు దుష్ప్రచారాలు చేస్తున్న రాజమహేంద్రవరం లలితా నగర్‌కు చెందిన దేవాబత్తుల నాగ మహేశ్‌ని త్రీటౌన్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. పూర్తిగా సమాచారం తెలియకుండా తప్పుడు వార్తలు, ఫేక్ వీడియోలను ప్రచారం చేసినా, మతపరమైన గొడవలకు ఆస్కారం కలిగే విధంగా సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ అప్పారావు హెచ్చరించారు.

Similar News

News October 17, 2025

బీజేపీ అగ్రవర్ణాలకు వత్తాసు పలుకుతుంది: MP కావ్య

image

కాంగ్రెస్ కోసం కష్టపడిన వారికి అవకాశాలు వస్తాయని ఎంపీ కడియం కావ్య అన్నారు. HNK కాంగ్రెస్ భవన్లో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎంపీ పాల్గొని మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలను ఏకతాటికి తీసుకొచ్చి అందరితో కలిసిపోయే పార్టీ కాంగ్రెస్ అన్నారు. దేశంలో బీజేపీ అగ్రవర్ణాలకు వత్తాసు పలుకుతోందని విమర్శించారు.

News October 17, 2025

నిర్మల్: ఇవాళ ఒక్కరోజే 160 దరఖాస్తులు

image

జిల్లాలో మద్యం దుకాణాల దరఖాస్తులు జోరుగా సాగుతున్నాయని జిల్లా ఎక్సైజ్ అధికారి రజాక్ తెలిపారు. శనివారంతో దరఖాస్తు చేసుకోవడానికి గడవు ముగుస్తుందన్నారు. దీంతో శుక్రవారం ఒక్కరోజే 160 దరఖాస్తులు వచ్చాయని, ఇప్పటివరకు మొత్తం 360 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు. మద్యం దుకాణాల దరఖాస్తులలో ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు.

News October 17, 2025

లడ్డూ ప్రసాదాలపై ఆ ప్రచారం అవాస్తవం: TTD

image

AP: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల ధరలను పెంచబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఖండించారు. టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కొందరు దీనిపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ధరలు పెంచే ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగా అవాస్తవాలను ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.