News April 1, 2025
రాజమండ్రి: తప్పుడు దుష్ప్రచారాలు చేస్తున్న వ్యక్తి అరెస్ట్

పాస్టర్ ప్రవీణ్ మరణంపై సోషల్ మీడియాలో వివిధ రకాలుగా తప్పుడు దుష్ప్రచారాలు చేస్తున్న రాజమహేంద్రవరం లలితా నగర్‌కు చెందిన దేవాబత్తుల నాగ మహేశ్‌ని త్రీటౌన్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. పూర్తిగా సమాచారం తెలియకుండా తప్పుడు వార్తలు, ఫేక్ వీడియోలను ప్రచారం చేసినా, మతపరమైన గొడవలకు ఆస్కారం కలిగే విధంగా సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ అప్పారావు హెచ్చరించారు.
Similar News
News April 21, 2025
శ్రీకాకుళం: కలెక్టర్ గ్రీవెన్స్‌కు 154 వినతులు

ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రీకాకుళం జడ్పీ కార్యాలయం వేదికైంది. సోమవారం జిల్లా రెవెన్యూ అధికారి ఎం. వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో “మీ కోసం” కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి, జిల్లా పరిషత్ సీఈవో శ్రీధర్ రాజా తదితర అధికారులు పాల్గొన్నారు. ప్రజల నుంచి మొత్తం 154 దరఖాస్తులు స్వీకరించారు. వాటిలో కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు.
News April 21, 2025
కొడాలి నాని హెల్త్ అప్డేట్

AP: గుండె సంబంధిత ఆపరేషన్ చేయించుకున్న వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని ప్రస్తుతం కోలుకుంటున్నట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. కొద్దిరోజుల క్రితం ముంబైలోని ప్రైవేటు ఆసుపత్రిలో ఆయనకు హార్ట్ సర్జరీ జరగగా అనంతరం హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. త్వరలోనే ప్రజల ముందుకు వస్తారని సన్నిహితులు చెబుతున్నారు.
News April 21, 2025
రాహుల్ ద్వంద్వ పౌరసత్వం కేసు.. కేంద్రానికి హైకోర్టు కీలక ఆదేశాలు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ద్వంద్వ పౌరసత్వం కేసులో కేంద్ర హోంశాఖకు అలహాబాద్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 10 రోజుల్లో ఆయన పౌరసత్వంపై తుది నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను వచ్చే నెల 5కు వాయిదా వేసింది. ఆయనకు బ్రిటిష్ పౌరసత్వం కూడా ఉందని, దీంతో భారత్‌లో ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదని పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు.