News October 12, 2024
రాజమండ్రి: దసరా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కందుల

రాష్ట్ర ప్రజలకు మంత్రి కందులు దుర్గేష్ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన రాజమహేంద్రవరంలోని క్యాంప్ కార్యాలయం నుంచి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. చెడుపై చివరికి మంచే గెలుస్తుందని గుర్తుచేసే రోజు విజయదశమి అని అన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుతున్నట్లు ఆయన తెలిపారు.
Similar News
News November 18, 2025
రాజమండ్రి: ఒకేసారి రెండు పథకాల డబ్బులు..!

తూర్పు గోదావరి జిల్లాలో పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా 1,14,991 మంది లబ్ధిదారులకు రెండో విడత ఆర్థిక సాయం అందించనున్నట్లు డీఏఓ ఎస్.మాధవరావు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అన్నదాత సుఖీభవ కింద రూ. 57.50 కోట్లు (ఒక్కో రైతుకు రూ. 5000), పీఎం కిసాన్ కింద రూ. 19.50 కోట్లు (ఒక్కో రైతుకు రూ. 2000) మంజూరయ్యాయి. మొత్తం రూ. 77 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.

రాజమండ్రి: ‘ప్రశాంతంగా 10 పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేయాలి’

రానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలను విద్యార్థులు ప్రశాంతంగా రాసేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అసిస్టెంట్ కమిషనర్ ఫర్ ఎగ్జామినేషన్స్ ఎం. అమల కుమారి అధికారులకు సూచించారు. సోమవారం ఆమె రాజమండ్రిలోని కంటిపూడి రామారావు మున్సిపల్ స్కూల్‌లోని పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. మరుగుదొడ్లు, తాగునీరు, ఇతర సదుపాయాలను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో అర్బన్ రేంజ్ డీఐ దిలీప్ కుమార్ పాల్గొన్నారు.