News June 28, 2024
రాజమండ్రి: నా సర్వీస్‌లో మరుపురాని ఘట్టం: IAS మాధవీలత
తూర్పుగోదావరి జిల్లాలో కలెక్టర్‌గా పనిచేసిన రెండేళ్ల రెండు నెలల కాలం తన సర్వీస్‌లో మరుపురాని ఘట్టం అని IAS డా.మాధవీలత అన్నారు. జిల్లా నుంచి రిలీవ్ అయిన ఆమెకు గురువారం స్థానిక పోలీస్ కన్వెన్షన్ సెంటర్లో అధికారులు వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో ఎస్పీ జగదీష్, జేసీ తేజ్ భరత్, సబ్‌కలెక్ట ర్ అశుతోష్ శ్రీవాత్సవ, జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, సిబ్బంది తదితరులు పాల్గొని ఘనంగా సన్మానించారు.
Similar News
News October 11, 2024
రంప: ఆకట్టుకుంటున్న పెద్ద పుట్టగొడుగు
రంపచోడవరం నియోజకవర్గం విఆర్‌పురం మండలం ఉమ్మిడివరం గ్రామంలో భారీ పుట్టగొడుగు ఆకట్టుకుంటుంది. సాధారణంగా పుట్ట గొడుగు 2 నుంచి 4 అంగుళాలు ఎత్తుకు ఎదిగింది. ఈ పుట్ట గొడుగు 2 అడుగులు ఎత్తు, 3 అడుగుల వెడల్పు గులాబీ రంగులో, ఎరుపు మచ్చలతో ఆకర్షనీయంగా ఉంది. స్థానికులు పుట్ట గొడుగుని ఆసక్తిగా చూస్తున్నారు. గతంలో ఎన్నడూ భారీ పుట్ట గొడుగు చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
News October 11, 2024
తూ.గో: పిడుగులు పడే ప్రమాదం
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు పిడుగుల ప్రమాదం పొంచి ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ అధికారులు హెచ్చరికలు జారీచేశారు. కాకినాడ రూరల్, తుని, కోనసీమ, పెద్దాపురం, సామర్లకోట, రంపచోడవరం, మారేడుమిల్లి, రాజానగరం రాజమండ్రి రూరల్ ప్రాంతాల్లో పిడుగులు ప్రమాదం ఉందని ఫోన్‌లకు రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది.
News October 11, 2024
తుని: చెరువులో మద్యం సీసాలు.. ఎగబడిన మద్యం ప్రియులు
తుని మండలం రాపాక శివారు చెరువులో 10 నుంచి 15 మూటల్లో మద్యం సీసాలు ఉండటంతో గురువారం స్థానికులు వాటి కోసం ఎగబడ్డారు. చెరువులో మద్యం ప్రియులు సీసాలను గంటల వ్యవధిలోనే తీసుకుపోయారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు అక్కడకి చేరుకొని విచారణ చేపట్టారు. 2 రోజుల క్రితం కేఒ మల్లవరంలో మద్యం కేసులో నలుగురిని రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. వారు భయపడి మద్యం సీసాలు చెరువులో పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు.