News April 1, 2025
రాజమండ్రి: పాస్టర్ ప్రవీణ్ కేసు.. ముమ్మరంగా దర్యాప్తు

పాస్టర్ ప్రవీణ్ మృతి కేసు రోజుకో మిస్టరీగా మారుతోంది. ప్రవీణ్ చనిపోకముందు బైక్‌పై HYD నుంచి రాజమండ్రి వచ్చే క్రమంలో పలుచోట్ల బైక్ నుంచి పడిపోయినట్లు ఉన్న దృశ్యాలు SMలో వైరల్ అవుతున్నాయి. అయితే అందులో ఉన్నది ప్రవీణ్ అనే విషయాన్ని పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. అసలు అతడిది హత్యనా? లేక రోడ్డు ప్రమాదమా? అనేది తేలాల్సి ఉంది. ఈ కేసును ఛేదించేందుకు డీఎస్పీ సహా ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి.
Similar News
News April 18, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News April 18, 2025
గద్వాల జిల్లా ఎస్పీ కీలక ఆదేశాలు

పంట పండించే ఏ రైతు నకిలీ విత్తనాలతో మోసపోకుండా చూడాల్సిన బాధ్యత పోలీస్‌పై ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ జిల్లాలోకి నకిలీ విత్తనాలు రావడం గానీ, వినియోగం కానీ జరగకుండా చూడాలని జిల్లా ఎస్పీ టి.శ్రీనివాస రావు అధికారులను ఆదేశించారు. గద్వాల జిల్లా పోలీస్ కార్యాలయంలో నేరాలపై రివ్యూ సమావేశం పోలీస్ అధికారులతో నిర్వహించారు. పోలీస్ వ్యవస్థపై ప్రజలకు మరింత నమ్మకం ఏర్పడాలన్నారు.
News April 18, 2025
గద్వాల: ‘సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి’

మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటియూ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఏ.వెంకటస్వామి, వీవీ నరసింహ పిలుపునిచ్చారు. గురువారం గద్వాల జిల్లా కేంద్రంలోని స్థానిక సీఐటీయూ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా, కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చారని తెలిపారు.