News April 6, 2025
రాజమండ్రి: ‘పోలీసుల విచారణను నేను నమ్మను’

పాస్టర్ ప్రవీణ్ది హత్యా?.. ప్రమాదమా అన్నది ప్రభుత్వం తేల్చాలని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ డిమాండ్ చేశారు. శనివారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..ప్రవీణ్ మరణించి రెండు వారాలు గడిచినా, నేటికీ పోస్టుమార్టం రిపోర్టు బహిర్గతం చేయకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కేసులో విచారణను కుటుంబ సభ్యులు నమ్ముతున్నా..తాను నమ్మనన్నారు. తనపై పెట్టిన కేసులకు భయపడేది లేదని ఆయన వ్యాఖ్యానించారు.
Similar News
News November 18, 2025
పరకామణి చోరీ కేసుపై TTD బోర్డు కీలక నిర్ణయం

తిరుమల పరకామణి చోరీ కేసులో టీటీడీ ఏర్పాటు చేసిన సమావేశంలో మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. పరకామణి చోరీలో గతంలో నమోదైన కేసులో పరిమితులు ఉన్నాయని కేసులో రాజీ వెనుక ఉన్న వారిని తేల్చేందుకు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో మరోసారి కేసు నమోదు చేయాలని తీర్మానించారు.
News November 18, 2025
NRPT: రైతులకు గన్ని బ్యాగులు ఇవ్వాలని వినతి

వరి ధాన్యం పండించిన రైతులకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తెచ్చేందుకు గన్ని బ్యాగులు ఇవ్వాలని సీపీఎం ఆధ్వర్యంలో నేతలు మంగళవారం నారాయణపేట కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ను కలిసి వినతిపత్రం అందించారు. జిల్లా కార్యదర్శి వెంకట్రాములు మాట్లాడుతూ.. రైతులకు గన్ని బ్యాగులు లేక ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు.
News November 18, 2025
SRCL: ఎస్సీ వసతి గృహాల వస్తువులకు టెండర్లు

జిల్లాలోని ఎస్సీ వసతి గృహాల విద్యార్థులకు అందించాల్సిన వస్తువులు, పరికరాల సరఫరా కోసం పిలిచిన టెండర్లను మంగళవారం ఓపెన్ చేశారు. కలెక్టరేట్లో ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమ అగర్వాల్ సమక్షంలో ఈ టెండర్లను పరిశీలించారు. జామెట్రీ బాక్స్, స్కేల్, వరల్డ్ మ్యాప్, స్టడీ చైర్, దుప్పట్లు, సీసీ కెమెరాలు మొదలైన వస్తువుల సరఫరాకు వచ్చిన దరఖాస్తులను ఆమె పరిశీలించారు.


