News March 25, 2024

రాజమండ్రి: ‘ప్రచారానికి ముందస్తు అనుమతి తీసుకోవాలి’

image

రాజకీయ పార్టీలు కచ్చితంగా ఎన్నికల నిబంధనలను పాటించాలని రూరల్ నియోజకవర్గ ఆర్వో తేజ్ భరత్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్డు షోలు, ర్యాలీలు, సభలు, మైక్‌లో ప్రచారం చేసుకునే విషయంలో 48 గంటల ముందుగా ఎన్నికల అధికారి నుండి అనుమతి తీసుకోవాలన్నారు. అందుకోసం సువిధ యాప్‌లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. సంబంధిత పత్రాలు ఆర్వో కార్యాలయంలో అందచేయాలని పేర్కొన్నారు.

Similar News

News April 16, 2025

RJY: ఇండోర్ పార్లమెంటు సభ్యులతో ఎమ్మెల్యే భేటీ

image

రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఉజ్జయిని పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా మహాకాళేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రాన్ని కుటుంబ సమేతంగా మహాదేవుని దర్శించుకున్న అనంతరం ఇండోర్ పార్లమెంటు సభ్యుడు శంకర్ లాల్వ ఆహ్వానం మేరకు ఎంపీ నివాసంలో మంగళవారం భేటీ అయ్యారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీనివాస్, భవాని దంపతులు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

News April 15, 2025

కోరుకొండలో రోప్‌వే.. ఫలించిన ఎమ్మెల్యే కృషి

image

కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం కింద నుంచి కొండపై వరకు 0.25 కిలోమీటర్ల మేర రోప్‌వే చేయాలని ఎమ్మెల్యే ప్రతిపాదనను కేంద్రం అంగీకరించింది. ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్, అన్నవరం దేవస్థానం వారి సమగ్ర ప్రణాళికతో డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను ఎంపీకి నేరుగా అందించడం వల్ల నలుగురు మంత్రులు ఆమోదించి 36 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

News April 15, 2025

డ్రోన్‌లతో ప్రత్యేక నిఘా: జిల్లా ఎస్పీ

image

తూ.గో.జిల్లాలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపేందుకు డ్రోన్‌లతో ప్రత్యేక నిఘాను పటిష్ఠం చేసినట్లు ఎస్పీ నరసింహ కిశోర్ తెలిపారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలోని నిర్మానుష్యమైన ప్రదేశాల్లో బహిరంగంగా మద్యం, గంజాయి తాగడం, పేకాట, చైన్ స్నాచింగ్ తదితర నేరాలపై డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘా పెట్టినట్లు చెప్పారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

error: Content is protected !!