News April 14, 2025
రాజమండ్రి: ప్రజలకు ఎస్పీ సూచనలు

భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరుగని కృషిచేసిన భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. రేపు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ప్రజలు జయంతి పండగ ఉత్సవాలను జరుపుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు.
Similar News
News April 19, 2025
ప్రవీణ్ శరీరంపై 18 గాయాలున్నాయి: హర్షకుమార్

పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసులో పోస్టుమార్టం రిపోర్టు బహిర్గతం చేయడానికి ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోందని మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ నిలదీశారు.శుక్రవారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రవీణ్ కేసులో పోలీసుల దర్యాప్తును తనతో సహా ఎవ్వరూ విశ్వసించడం లేదని వ్యాఖ్యానించారు. తన వద్దకు వచ్చిన పోస్టుమార్టం రిపోర్ట్ ప్రకారం ప్రవీణ్పై 18 శరీరంపై గాయాలున్నాయని, ఇది ముమ్మాటికీ హత్యే అని పేర్కొన్నారు.
News April 18, 2025
తూ.గో. జిల్లా ప్రజలకు హెచ్చరిక

తూర్పు గోదావరి జిల్లా ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నేడు జిల్లాలో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని APSDMA సూచించింది. చెట్ల కింద ఎవరూ ఉండవద్దని హెచ్చరించింది.
News April 18, 2025
RJY: డోర్ డెలివరీ కేసు.. ప్రత్యేక న్యాయవాదిగా ముప్పాళ్ల

ఏపీలో సంచలనం రేకెత్తించిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ అలియాస్ అనంతబాబు డోర్డెలివరీ కేసులో న్యాయ విచారణకు ఏపీ ప్రభుత్వం ఈ మేరకు గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఈ న్యాయ విచారణలో ప్రాసిక్యూషన్కు సహాయం చేయడానికి ప్రత్యేక న్యాయవాదిగా ప్రముఖ సీనియర్ న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సెల్ సభ్యుడు, మానవ హక్కుల రక్షణ కోసం పోరాటం చేస్తున్న ముప్పాళ్ల సుబ్బారావును నియమించింది.