News October 11, 2024
రాజమండ్రి: ప్రజలకు దశమి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు కలెక్టర్ ప్రశాంతి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ నుంచి శుక్రవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని నవరాత్రుల సందర్భంగా ప్రతి ఇంట అత్యంత భక్తిశ్రద్ధలతో కొలుస్తూ దసరా వేడుకలను జరుపుకుంటామని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరి పైన ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News December 1, 2025
2.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు: కలెక్టర్

తూ.గో జిల్లాలో 2 లక్షల 10వేల 210 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి సోమవారం ప్రకటించారు. ఈ ఖరీఫ్‌లో ధాన్యం సేకరణకు సంబంధించి 42,822 కూపన్లను జనరేట్ చేసినట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే 11,767 మంది రైతులకు రూ.2,0246 కోట్లను చెల్లించామన్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలన్నారు.
News December 1, 2025
తూ.గో: చేతబడి చేశారన్న అనుమానంతో దారుణ హత్య

కోరుకొండ (M) దోసకాయలపల్లిలో ఆనంద్ కుమార్ (30) ఆదివారం దారుణ హత్యకు గురయ్యారు. ఆనంద్ తనకు చేతబడి చేశాడని రాజ్‌కుమార్ అనుమానంతో కత్తితో దాడి చేసి హతమార్చాడు. ఆనంద్ భార్య త్రివేణికి రాజ్ కుమార్ సమీపబంధువు. అతను కొన్నాళ్లు ఆనంద్ ఇంట్లో ఉండేవాడు. ఆ సమయంలో భార్య పట్ల రాజ్‌కుమార్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని అతన్ని బయటికి పంపించారు. కక్ష పెట్టుకున్న రాజ్‌కుమార్ హత్య చేశాడని CI సత్య కిషోర్ వివరించారు.
News December 1, 2025
పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

డిసెంబర్ 1న తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన పెన్షన్ రేట్ల ప్రకారం డిసెంబరు నెలలో మొత్తం 2,34,520 మంది లబ్ధిదారులకు రూ.1027.04 కోట్ల పెన్షన్ మొత్తాన్ని పంపిణీ చేయనున్నట్లు వివరించారు.


